చివరి ఆయకట్టు వరకు సాగునీరు
వరంగల్: చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సాగు నీటి నిర్వహణ, సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ డాక్టర్ సత్యశార ద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ అంకిత్ కుమార్, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి
వేసవికాలంలో తాగునీటి సమస్య, కరెంట్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లు ఫేస్ 1గ్రామాల్లో మంజూరైన వాటి కి మార్కింగ్ ఇవ్వాలని, మిగిలిన గ్రామాల నుంచి వచ్చిన దరఖాస్తులను ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 కేటగి రీల్లో ఎంపిక చేసిన దరఖాస్తులను పరిశీలించేందుకు చర్య తీసుకోవాలని పీడీ హౌసింగ్ గణపతిని ఆదేశించారు. భూగర్భ జలాలు పడిపోయిన ప్రాంతాలను గుర్తించి నీటిసమస్య లేకుండా ప్రత్యామ్నయ చర్యలు తీసుకోవాలన్నారు. ఇరిగేషన్, మిషన్ భగీరథ, ఎలక్ట్రిసిటీ శాఖల అధికారులు వేసవికాలం యాక్షన్ ప్లాన్ తయారుచేసి సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నా రు. ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్, అగ్రికల్చర్, మిషన్‌భగీరథ,ఎలక్ట్రిసిటీ అధికారులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, డీసీఓ నీరజ, డీపీఓ కల్పన, తహసీల్దార్ ఇక్బాల్, కలెక్టరేట్ ఏఓ విశ్వప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.
ఆకేరు వాగులో ఇసుక తీస్తే చర్యలు
వర్ధన్నపేట మండలంలోని ఆకేరు వాగులో ఇసుక తీస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సత్యశారద హెచ్చరించారు. సోమవారం వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు చెందిన ట్రాక్టర్ యాజమానులు లోకల్ అవసరాలకు ఆకేరు వాగులో ఇసుక తీ సుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ నిబంధనల ప్రకారం గోదావరి ఇసుక తప్ప.. వాగుల్లో ఇసుక తీస్తే చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఆలోచన విరమించుకోవాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment