వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Published Wed, Mar 12 2025 7:11 AM | Last Updated on Wed, Mar 12 2025 7:11 AM

వరంగల

వరంగల్‌

బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025

వాతావరణం

జిల్లాలో ఉదయం వాతావరణం చలిగా

ఉంటుంది. మధ్యాహ్నం వేళ ఎండతోపాటు ఉక్కపోత ఉంటుంది. సాయంత్రం సమయంలో ఆహ్లాదంగా ఉంటుంది.

జీనోమ్‌ ప్రాజెక్ట్‌తో వ్యాధుల గుర్తింపు

జీనోమ్‌ ప్రాజెక్ట్‌తో మానవుడి వ్యాధులకు కారణమైన జన్యువులను గుర్తించవచ్చని కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు.

8లోu

ముల్కలపల్లి యువకుడు ఉపేందర్‌..

డోర్నకల్‌: గ్రూప్‌–2 ఫలితాల్లో ముల్కలపల్లికి చెందిన మేకల ఉపేందర్‌ ప్రతిభ కనబరిచారు. గ్రామానికి చెందిన మేకల రమణయ్య–రమణమ్మ దంపతుల కుమారుడు ఉపేందర్‌ ప్రస్తుతం మహబూబాబాద్‌ కలెక్టరేట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తూ గ్రూప్‌–2 పరీక్షలు రాశారు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో ఉపేందర్‌ 423.119 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో టాప్‌–10లో 9వ స్థానంలో నిలిచారు. ప్రతిభ చాటిన ఉపేందర్‌ను గ్రామస్తులు అభినందించారు.

కొందరు ఒకపక్క ఉద్యోగం చేస్తూనే ఉన్నతస్థాయికి వెళ్లాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడ్డారు. అనుకున్న లక్ష్యం సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గ్రూప్‌–2 ఫలితాల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు ర్యాంకులు సాధించారు. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఉన్న సమయంలోనే ప్రణాళికాబద్ధంగా చదవడం, విషయాన్ని అర్థం చేసుకుని పోటీ పరీక్షల్లో రాయడం ద్వారా ర్యాంకులు సాధించవచ్చని ఆయా అభ్యర్థులు అంటున్నారు.

– సాక్షి నెట్‌వర్క్‌

గూడూరు: మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం మారుమూల ఏజెన్సీ గ్రామం జంగుతండాకు చెందిన మూడు భద్రు కుమారుడు శ్రీకాంత్‌ గ్రూప్‌–2 ఫలితాల్లో ఎస్టీ కేటగిరీలో ప్రతిభ కనబరిచారు. ఎస్టీ కేటగిరీలో ప్రథమ, జోనల్‌ వైస్‌ ఓపెన్‌ కేటగిరీలో మూడో ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 38వ ర్యాంకు సాధించినట్లు శ్రీకాంత్‌ తెలిపారు. గతంలో గ్రూప్‌–4 సాధించి రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్నట్లు, గ్రూప్‌–3 లో కూడా మంచి మార్కులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాంత్‌ను మాజీ సర్పంచ్‌ అరుణమంగీలాల్‌నాయక్‌, మాజీ ఎంపీటీసీ గీతాఅమరేందర్‌రెడ్డి, తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు సన్మానించారు.

మహబూబాబాద్‌ అర్బన్‌: మానుకోట జిల్లా కేంద్రంలోని డోలి వెంకటేశ్వర్లు–పద్మ దంపతుల కుమార్తె డోలి సంధ్య గ్రూప్‌–2లో రాష్ట్రస్థాయిలో 205 ర్యాంకు సాధించారు. 600 మార్కులకు 382.4 మార్కులు వచ్చాయి. అత్యధిక మార్కులు సాధించడంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అభినందించారు.

కొడకండ్ల: మండల కేంద్రంలోని నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన ప్రణీత్‌ 388 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 138వ ర్యాంకు సాధించారు. సోమనారాయణ–నాగలక్ష్మి మూడో కుమారుడు ప్రణీత్‌ 2019 హైదరాబాద్‌లోని సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన తర్వాత హైదరాబాద్‌లో కోచింగ్‌ తీసుకుని గ్రూప్స్‌ పరీక్షలు రాశారు. డిసెంబర్‌లో వెలువడిన గ్రూప్‌–4 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 58వ ర్యాంకు సాధించి ముషీరాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. గ్రూప్‌–1 పరీక్షలో 380 మార్కులు సాధించగా.. గ్రూప్‌–2 ఫలితాల్లో 388 మార్కులతో రాష్ట్రస్థాయిలో 138వ ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా ప్రణీత్‌కు స్థానిక పద్మశాలి సంఘం నాయకులతోపాటు మిత్రులు అభినందనలు తెలిపారు.

రేగొండ: రేగొండ మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన మూలగుండ్ల భాగ్యమ్మ, సాంబరెడ్డిల కుమారుడు ఉపేందర్‌ రెడ్డి చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభావంతుడు. గ్రూప్‌–2లో రాష్ట్ర స్థాయిలో 28వ ర్యాంకు సాధించాడు. ఉపేందర్‌ ప్రస్తుతం పలిమెల తహసీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలోనూ పంచాయతీ కార్యదర్శిగా నాలుగేళ్లపాటు సేవలందించాడు. ప్రస్తుతం గ్రూప్‌–2లో ప్రతిభ చూపడంతో తల్లిదండ్రులతోపాటు, స్నేహితులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాసింపల్లి గ్రామానికి చెందిన శనిగరపు ప్రవీణ్‌కుమార్‌ రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబానికి చెందిన శనిగరపు రాధ–భద్రయ్య దంపతుల రెండో కుమారుడు ప్రవీణ్‌కుమార్‌. తల్లి రాధ అంగన్‌వాడీ హెల్పర్‌గా, తండ్రి భద్రయ్య సింగరేణి సంస్థలో కాంట్రాక్టు స్వీపర్‌గా పనిచేస్తున్నారు. ప్రవీణ్‌కుమార్‌ బీటెక్‌ పూర్తి చేసి 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించి గణపురం మండలంలోని కర్కపల్లిలో విధులు నిర్వర్తించారు. 2021లో వీఆర్‌ఓ ఉద్యోగం సాధించి 6 నెలలపాటు మహదేవపూర్‌ మండలంలోని అంబటిపల్లిలో పనిచేశారు. అదే సంవత్సరంలో గ్రూప్‌–4 పరీక్షలో ప్రతిభ కనబరిచి హైదరాబాద్‌లోని జీఎస్టీ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేశారు. అదేశాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే 2024 డిసెంబర్‌లో జరిగిన గ్రూప్‌–2 పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు, కాళేశ్వరం జోన్‌ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు.

బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన చిమ్ముల రాజశేఖర్‌రెడ్డి గ్రూప్‌–2లో రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించాడు. చిమ్ముల అరుణ– మల్లారెడ్డి దంపతులు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురు ప్రస్తుతం జనగామ మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నది. కుమారుడు చిమ్ముల రాజశేఖర్‌రెడ్డి గ్రూప్‌–2 ఫలితాల్లో 423.933 మార్కులు సాఽధించి రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు సాధించాడు. గతంలో రాజశేఖర్‌రెడ్డి వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శి పదవులకు కూడా ఎంపికయ్యాడు.

మహబూబాబాద్‌ రూరల్‌ : ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న కూటికంటి శివ గ్రూప్‌ –2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 25వ ర్యాంకు సాధించారు. 2020 బ్యాచ్‌ ఎస్సైగా ఉద్యోగం సాధించిన శివ 2022 జనవరి నుంచి మహబూబాబాద్‌ జిల్లా పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో ఎస్సైగా పనిచేసి ప్రస్తుతం మహబూబాబాద్‌ టౌన్‌ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు.

గిరిజన ఆణిముత్యం శ్రీకాంత్‌

న్యూస్‌రీల్‌

మెరిసిన సంధ్య

గ్రూప్‌– 2 ఫలితాల్లో ఓరుగల్లు అభ్యర్థుల ప్రతిభ

పలువురికి మెరుగైన ర్యాంకులు

ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షకు సన్నద్ధం

హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా వాసులు

ప్రణీత్‌ ప్రతిభ..

ఉద్యోగం చేస్తూ..

రాజశేఖర్‌రెడ్డికి 8వ ర్యాంకు

రాణించిన రైతు బిడ్డ

ఎస్సై శివకు 25వ ర్యాంకు

No comments yet. Be the first to comment!
Add a comment
వరంగల్‌1
1/10

వరంగల్‌

వరంగల్‌2
2/10

వరంగల్‌

వరంగల్‌3
3/10

వరంగల్‌

వరంగల్‌4
4/10

వరంగల్‌

వరంగల్‌5
5/10

వరంగల్‌

వరంగల్‌6
6/10

వరంగల్‌

వరంగల్‌7
7/10

వరంగల్‌

వరంగల్‌8
8/10

వరంగల్‌

వరంగల్‌9
9/10

వరంగల్‌

వరంగల్‌10
10/10

వరంగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement