
మూల్యాంకన కేంద్రం పరిశీలన
కాళోజీ సెంటర్: వరంగల్ ఎల్‌బీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ మూల్యాంకన కేంద్రాన్ని ఇంటర్ బోర్డు అధికారులు మంగళవారం సందర్శించారు. ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన మూల్యాంకన కేంద్రంలో ఏర్పాట్లు, స్ట్రాంగ్‌రూంలు తదితర ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా క్యాంపు అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాతోపాటు మహబూబాబాద్, ములుగు జిల్లాల మూల్యాంకన సిబ్బందికి శిక్షణ ఇచ్చి సోమవారం స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభించినట్లు వివరించారు.
ఎన్‌హెచ్‌ఆర్‌సీ
జిల్లా చైర్మన్‌గా అశోక్
గీసుకొండ: జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) జిల్లా చైర్మన్‌గా గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం గ్రామానికి చెందిన గంగుల అశోక్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ కమిటీ స్టేట్ చైర్మన్ బద్దిపడిగ శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణకు పాటుపడతానని అన్నారు. తనపై నమ్మకంతో నియమించిన స్టేట్ చైర్మన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇంటర్ పరీక్షలకు
298 మంది గైర్హాజరు
కాళోజీ సెంటర్: జిల్లా వ్యాప్తంగా మంగళవారం 26 కేంద్రాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. 5,836 మంది జనరల్ విద్యార్థులకు 5,611 మంది, 910 మంది ఒకేషనల్ విద్యార్థులకు 837 మంది హాజరైనట్లు డీఐఈఓ శ్రీధర్‌సుమన్ తెలిపారు. మొత్తం 298 మంది గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.
పాకాలను సందర్శించిన
ఇల్లెందు ఎమ్మెల్యే కనకయ్య
ఖానాపురం: మండలంలోని పాకాల సరస్సును ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాకాల కట్ట, తూములను పరిశీలించారు. పాకాల నీటి సామర్థ్యం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాకాల సరస్సు నీటిని ఇల్లందు నియోజకవర్గంలోని గార్ల, బయ్యారం మండలాల సాగు, తాగునీటి అవసరాలకు తరలించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు.
ఇక కోతుల బెడద లేనట్టే!
సంగెం: మండలంలోని కాపులకనిపర్తి గ్రామంలో ఇక వానరాల బెడద తప్పినట్లేనని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో కోతులు ప్రజలను ఇబ్బందులకు గురిచేసేవి. దీంతో వాటిని పట్టించి అడవిలో వదిలేయాలని గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. మంగళవారం మాజీ సర్పంచ్ ఎర్రబెల్లి గోపాల్‌రావు తన సొంత నిధులు వెచ్చించి గ్రామంలోని 170 వానరాలను పట్టించి అడవిలో వదిలివేయించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గోపాల్‌రావు, సహకరించిన రైస్ మిల్లు యజమానులకు గ్రామ ప్రత్యేకాధికారి, ఎంపీఓ కొమురయ్య కృతజ్ఞతలు తెలిపారు.
రైతులకు రశీదులు ఇవ్వాలి
రాయపర్తి: పురుగు మందులను కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వలని జిల్లా వ్యవసాయాధికారి కె.అనురాధ సూచించారు. మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో పురుగు మందుల డీలర్లకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పురుగు మందుల స్టాక్ వివరాలను వెంటవెంటనే ఆన్‌లైన్ చేసేలా డీలర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. పెండింగ్ లేకుండా ఈపాస్ మిషన్‌లో స్టాక్‌క్లియర్ చేసుకోవాలని, ప్రభుత్వ నిబంధనలను పాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి గుమ్మడి వీరభద్రం, ఏఈఓలు, డీలర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment