
నర్సంపేటలో భూవివాదం
నర్సంపేట: భూవివాదంలో ఇరువర్గాలు రాళ్లతో దా డి చేసుకున్న ఘటన మంగళవారం నర్సంపేటలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నర్సంపేట మాదన్నపేట రోడ్డులోని 111 సర్వే నంబర్‌లో మా జీ మిలిటరీ అధికారికి భూమి ఉంది. అందులోని నాలుగు ఎకరాల భూమిని బీఆర్‌ఎస్ నాయకుడు, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామితో పాటు అతడి స్నేహితులు కొనుగోలు చేశారు. అగ్రి మెంట్ ప్రకారం అనుకున్న సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడంతో యజమాని రామచంద్రమోహన్ తిరిగి పెండెం రామానంద్, ఓర్సు తిరుపతితోపాటు మరికొందరికి విక్రయించాడు. వారు ఆ స్థలంలో పనులు చేపట్టారు. దీంతో ఇరువర్గాలు కో ర్టును ఆశ్రయించాయి. కోర్టులో కేసు నడుస్తుండగా రామస్వామినాయక్ వాహనాల ద్వారా కొంత మందిని భూమి వద్దకు తరలించి ఘర్షణకు దిగాడు. ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నాయి. బాలకిషన్ అనే వ్యక్తి తలకు గాయం కాగా సీఐ రమణమూర్తి, ఎస్సై రవితోపాటు మరికొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. వరంగల్ డీసీపీ అంకిత్‌కుమార్‌తోపాటు నర్సంపే ట ఆర్డీఓ ఉమాదేవి సంఘటనా స్థలానికి చేరుకొని భూమి పత్రాలను తీసుకురావాలని ఇరువర్గాలకు సూచించి సమస్య సద్దుమణిగింపజేశారు. ఓడీసీ ఎంఎస్ చైర్మన్ రామస్వామినాయక్‌కు ఈ భూమితో ఎలాంటి సంబంధం లేదని, సమయానికి డబ్బులు చెల్లించకపోవడంతో పెండెం రామానంద్, ఓర్సు తిరుపతికి విక్రయించానని, ఈ భూమిపై వారికే హక్కు ఉందని యజమాని రామచంద్రమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, భూమి కొనుగోలు చేసిన ఇరువర్గాల వారు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావడం గమనార్హం. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసిన ట్లయ్యింది.
రామస్వామిపై కేసు నమోదు
ఉద్దేశపూర్వకంగా భూమి వద్దకు వచ్చి కొంత మందితో ఘర్షణకు దిగిన ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాం. రెవెన్యూ అధికారులు కూడా హక్కు పత్రాలు చూపించాలని ఆయనను అడిగారు.
– రమణమూర్తి, సీఐ
ఇరువర్గాల రాళ్ల దాడితో ఉద్రిక్తత
పలువురికి గాయాలు..
పోలీసుల లాఠీచార్జ్

నర్సంపేటలో భూవివాదం
Comments
Please login to add a commentAdd a comment