
ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలి..●
● సీసీఐ సీనియర్ సెక్రటరీ దామోదర్
హన్మకొండ: వినియోగదారులు ప్రశ్నించేతత్వాన్ని అలవాటు చేసుకోవాలని దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు, సీసీఐ సీనియర్ సెక్రటరీ డాక్టర్ పల్లెపాడు దామోదర్ అన్నారు. వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండ ఎకై ్సజ్ కాలనీలో జిల్లా వినియోగదారుల సలహా సంఘం ఆధ్వర్యంలో వినియోగదారుల చైతన్య సదస్సు నిర్వహించారు. సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఏ వస్తువు కొన్నా.. ఒరిజినల్ బిల్లులు తీసుకోవాలన్నారు. ఉత్పత్తిదా రుడు ఇచ్చే గ్యారంటీ, వారంటీ కార్డులను జాగ్రత్తగా భద్రపర్చుకోవాలని సూచించారు. వస్తువుల్లో నాణ్యతా లోపం ఉన్నప్పుడు వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో ఫిర్యాదు చేసి న్యాయం పొందాలన్నారు.
నవోదయలో హోలీ వేడుకలు!
మామునూరు: మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో శుక్రవారం ఉదయం హోలీ వేడుకలు జరుపుకున్నట్లు తెలిసింది. విద్యార్థులు గేటు బయటకు వెళ్లి కోడిగుడ్లు తెచ్చి హోలీ సంబురాల్లో మునిగిపోయారు. గేటు బయటకు ఎలా వెళ్లారనే దానిపై ప్రిన్సిపాల్ విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజంతా చదువుకుని పరీక్ష రాయాల్సిన సమయంలో.. వేడుకలకు ఎలా అనుమతిచ్చారనే దానిపై ఉన్నతాధికారులు ప్రిన్సిపాల్‌ను వివరణ కోరినట్లు విశ్వసనీయ సమాచారం.
ఇరువర్గాల దాడులు
వర్ధన్నపేట: వర్ధన్నపేట పట్టణంలో శుక్రవారం ఇరువర్గాల యువకులు పరస్పర దాడులు చేసుకున్నా రు. వివరాలిలా ఉన్నాయి. డీసీ తండా పరిధిలోని బావనికుంట తండాకు చెందిన యువకులు పట్టణంలోని మద్యం షాపులో మద్యం సేవిస్తున్నా రు. ఈ క్రమంలో యువకుల మధ్య మాటామాట పెరగడంతో ఇరువర్గాలుగా విడిపోయి దాడులకు దిగారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాల వారు ఆస్పత్రి వద్దకు చేరుకుని మళ్లీ ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. వెంటనే ఎస్సై చందర్ వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడుల్లో గాయపడిన బాబులాల్, వాంకుడోతు హుస్సేన్ తదితరులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.