
ఆకట్టుకుంటున్న వైరెటీలు
మహిళల షాపింగ్ కోసం మండిబజార్‌లో ప్రత్యేక దుకాణాలు వెలిశాయి. ఢిల్లీ, ఆగ్రాల నుంచి బ్రైడల్ వెడ్డింగ్ వియర్ చీరలు, కుర్తా పైజామాలు ఆకట్టుకుంటున్నాయి. డ్రెస్ మెటీరియల్స్, పట్టు శారీస్, రెడీమేడ్, కిడ్స్‌వేర్, బ్యాంగిళ్లు, చెప్పులు, జ్యువెల్లరీ వంటివి ఇక్కడ లభిస్తున్నాయి. రంజాన్ నెలలో సంప్రదాయబద్ధంగా ఉపయోగించే సుర్మా టోపీలు, సుగంధ ద్రవ్యాలు, అత్తరులు, ప్రత్యేక దుస్తులు, కుర్తా పైజామా వంటి వాటికి గిరాకీ పెరుగుతోంది. అలాగే మహిళలు విభిన్న డిజైన్లతో కూడిన గాజులు, ముత్యాలు కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. పిల్లలు, యువతకు సంబంధించిన వైరెటీ దుస్తులు కూడా అందుబాటులో ఉండడంతో షాపింగ్ చేస్తున్నారు.