గీసుకొండ: అడవులే జీవనాధారంగా బతుకుతున్న ఆదివాసీలను అక్కడి నుంచి వెళ్లగొట్టి కార్పొరేట్ సంస్థలకు అటవీ సంపదను దోచి పెట్టాలని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను తిప్పకొట్టాలని ఆదివాసీ తోటి తెగ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గుర్రం రఘు పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని జాన్‌పాకలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా తోటి తెగ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరిట మారణ హోమం సృష్టిస్తున్నారన్నా రు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఆదివాసీలు, మైదాన ప్రాంత గిరిజనులు పోరాడాలన్నారు. తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్, నాయకులు సోమ సాంబయ్య, మధు, హెడ్మాకి వీరయ్య, సోమ నాగరాజు, సోయం శరత్‌బాబు, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీ తోటి తెగ ఉమ్మడి జిల్లా
అధ్యక్షుడు గుర్రం రఘు