వర్ధన్నపేట: వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి అన్ని చర్యలు తీసుకుంటానని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి.సాంబశివరావు తెలిపారు. కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు సోమవారం రాత్రి ఆయన వర్ధన్నపేట ప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఆర్‌ఓఆర్ నీరు అందకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుని నీరందిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రామ్మూర్తి వివరించారు. సాంబశివరావు వార్డులు కలియ తిరుగుతూ అన్ని వసతులు సమకూరుతున్నాయా? అని రోగులను అడిగి తెలిసుకున్నారు. తాగునీటి సమస్య ఉందని ఆయన దృష్టికి తీసుకురాగా.. ఆయన స్పందిస్తూ.. వెంటనే తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈసందర్భంగా డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ.. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
సాంబశివరావు