దుగ్గొండి: కేంద్ర ప్రభుత్వ పరిధిలో నిర్వహిస్తున్న పల్లె దవాఖాన సేవలను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు మంగళవారం పరీక్షించారు. మల్లంపల్లిలోని పల్లె దవాఖానలో డాక్టర్ అరుణ్‌జిత్, డాక్టర్ ఇక్బాల్ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణను అడిగి తెలుసుకున్నారు. వ్యాధి నిరోధక టీకాలు, కుష్ఠు నిర్మూలన, అంధత్వం, మాతా శిశుసంరక్షణ కార్యక్రమాలపై ఆరాతీశారు. సేవలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రకాశ్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ విజయ్ కుమార్, క్వాలిటీ మేనేజర్ అనిల్‌కుమార్, డీపీఎంఓ అర్చన, డాక్టర్ కిరణ్‌రాజు, రాకేశ్, భరత్‌కుమార్, సీహెచ్‌ఓ సలోమీ, హెచ్‌ఈఓ సాంబయ్య, హెచ్‌వీ సంధ్యారాణి, ఏఎన్‌ఎం కోమల, హెల్త్ అసిస్టెంట్ రహమాన్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
వేధిస్తున్న వ్యక్తిపై కేసు
సంగెం: మహిళను వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. మండలంలోని మొండ్రాయి గ్రామానికి చెందిన ఓ వితంతు మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. కాగా, అదే గ్రామానికి చెందిన వేల్పుల అయిలయ్య.. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ద్విచక్రవాహనంపై వీధిలోకి వచ్చి హారన్ కొడుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. విషయాన్ని ఆమె స్థానికులకు చెప్పగా వారు అతడిని నిలదీయగా తన ద్విచక్రవాహనాన్ని వదిలి వెళ్లిపోయాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేర కు అయిలయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
వ్యవసాయ మార్కెట్‌లో
సమస్యలు పరిష్కరించాలి
వరంగల్: ఏనుమాములలోని వ్యవసాయ మార్కెట్‌లో సమస్యలు పరిష్కరించాలని మార్కెటింగ్‌శాఖ అధికారులు కోరారు. ఈ మేరకు మంగళవారం వారు కలెక్టర్ సత్యశారదను కలిశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వేసవి దృష్ట్యా రైతులకు మజ్జిగ ప్యాకెట్లు అందించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. అన్నపూర్ణ క్యాంటీన్‌లో ఇప్పటివరకు అందజేస్తున్న వెయ్యి భోజనాలను రెండు వేలకు పెంచాలని చాంబర్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. సీసీ కెమెరాలు, అన్నపూర్ణ క్యాంటీన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించినట్లు తెలి సింది. కార్యక్రమంలో మార్కెటింగ్‌శాఖ ఆర్‌జేడీఎం శ్రీనివాస్, డీఎంఓ సురేఖ, మార్కెట్ కార్యదర్శి జి.రెడ్డి, ఏఎస్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
కుటుంబ సభ్యుల ఓట్లు
ఒకే బూత్‌లో ఉండాలి
వరంగల్: కుటుంబ సభ్యుల ఓట్లు అన్ని ఒకే పోలింగ్ బూత్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు కలెక్టర్ సత్యశారదను కోరారు. కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 7,72,824 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, ఎలక్షన్ డీటీ రంజిత్, రాజకీయ పార్టీల నాయకులు ఈవీ.శ్రీనివాసరావు, బాకం హరిశంకర్, కె.శ్యాం, ఫిరోజుల్లా, జె. అనిల్‌కుమార్, నాగరాజు పాల్గొన్నారు.
గ్రంథాలయ బడ్జెట్ ఆమోదం
వరంగల్: జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్‌చార్జ్, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి అధ్యక్షతన సంస్థ జిల్లా కమిటీ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. 2025–26 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలను ఆమోదిస్తూ తీర్మానం చేశారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 16 గ్రంథాలయాల అభివృద్ధికి కమిటీ సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శశిజాదేవి, డీఈఓ జ్ఞానేశ్వర్, డీపీఓ కల్పన, వయోజన విద్యాశాఖ అధికారి రమేశ్‌రెడ్డి, ఏపీఆర్‌ఓ ప్రేమలత, జిల్లా గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.