వర్ధన్నపేట: రుణమాఫీ అయిన రైతులకు తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలని, సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతుల రుణాలను లీగల్‌గా కవర్ చేసి వారికి మాఫీ లబ్ధి చేకూర్చాలని టెస్కాబ్ చైర్మ న్ మార్నేని రవీందర్‌రావు అన్నారు. వర్ధన్నపేట డీసీసీబీ శాఖలో రాయపర్తి, నందనం, ఐనవోలు, వర్ధన్నపేట సొసైటీలు, ఐనవోలు, వర్ధన్నపేట డీసీసీబీల మేనేజర్లు, నోడల్ అధికారులు, సొసైటీ సిబ్బందితో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్‌రావు మాట్లాడుతూ బ్యాంకు లక్ష్యాలను నూటికి నూరు శాతం పూర్తిచేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నోడల్ అధికారి, ఏజీఎం గొట్టం స్రవంతి, బ్రాంచ్ మేనేజర్లు సమత, శ్రావణ్, భద్రునాయక్, నందనం సొసైటీ చైర్మన్ చందర్‌రావు, వర్ధన్నపేట, రాయపర్తి సొసైటీ చైర్మన్లు రాజేశ్‌ఖన్నా, రామచంద్రారెడ్డి, సొసైటీ సీఈఓలు వెంకటయ్య, యాదగిరి, సంపత్, సోమయ్య ఉన్నారు.
టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు