హన్మకొండ అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల నిధులు విడుదల చేసి ఉగాది కానుకగా అందజేసింది. మొత్తంగా రూ.18.33కోట్లు సంఘాల ఖాతాలో జమ కానున్నాయి. హనుమకొండ జిల్లాలో సుమారు 12వేల ఎస్‌హెచ్‌జీలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం వీఎల్‌ఆర్ 386 వీఓల పరిధిలోని 8,446 ఎస్‌హెచ్‌జీలకు మాత్రమే నిధులు వస్తున్నాయి. ఆర్థిక క్రమ శిక్షణ లేక రుణాల చెల్లింపుల్లో వెనకబడిన కారణంగా సుమారు 1,500 సంఘాలు వీఎల్‌ఆర్ కోల్పోయాయి. సంఘాలు ఎంత రుణం తీసుకున్నా వీఎల్‌ఆర్ మాత్రం రూ.5లక్షల రుణం ఇస్తారు.
మండలాల వారీగా వీఎల్‌ఆర్ అర్హత పొందిన సంఘాల వివరాలు
మండలం వీఓలు ఎస్‌హెచ్‌జీలు వీఎల్‌ఆర్
(రూ.లక్షల్లో)
ఆత్మకూరు 29 573 113.26
భీమదేవరపల్లి 43 955 228.07
దామెర 22 494 118.71
ధర్మసాగర్ 40 877 183.71
ఎల్కతుర్తి 39 821 188.85
హసన్‌పర్తి 24 517 114.03
ఐనవోలు 35 799 160.29
కమలాపూర్ 51 1,325 304.73
నడికుడ 28 485 90.49
పరకాల 14 289 62.84
శాయంపేట 42 842 159.60
వేలేరు 19 469 108.94
మొత్తం 386 8,446 1,833.53
రూ.18.33 కోట్లు
వీఎల్‌ఆర్ విడుదల