
గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి
నర్సంపేట: గుండెపోటుతో పదో తరగతి విద్యార్థి మృతిచెందిన సంఘటన చెన్నారావుపేట మండలంలోని జల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పింగిళి రజనీకర్‌రెడ్డి–నవత దంపతుల ఏకై క కుమారుడు అశ్వంత్‌రెడ్డి (15) నర్సంపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈనెల 21 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. బుధవారం గుండెపోటు రావడంతో నర్సంపేట ఆస్పత్రికి తరలించగా చికి త్స పొందుతూ మృతిచెందాడు. కుమారుడు గుండెపోటుతో మృతిచెందడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడి కుటుంబాన్ని మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి ప రామర్శించారు. విద్యార్థి మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ యన వెంట కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు బాదావత్ బాలునాయక్, మొండె భద్రయ్య,కుర్ర వెంకటేశ్వ ర్లు, జర్పుల ప్రవీణ్, కేతిడి వెంకట్‌రెడ్డి, బిట్ల శ్రీని వాస్, విజేందర్, రంజిత్ ఉన్నారు.
జల్లి గ్రామంలో విషాదఛాయలు