వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Mar 21 2025 1:13 AM | Updated on Mar 21 2025 1:13 AM

వరంగల

వరంగల్‌

శుక్రవారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2025

నైపుణ్యాలు పెంచుకోవాలి

ఇంజనీరింగ్‌ విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రం అన్నారు.

IIలోu

రాయితీ గడువు సమీపిస్తుండడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన

ఇప్పటికే తప్పుడు ఎంట్రీలతో

రూ.లక్షల్లో అదనపు భారం

ప్లాట్ల పరిశీలనకు ముందే

క్రమబద్ధీకరణ ఫీజుతో హైరానా

మాస్టర్‌ప్లాన్‌ రోడ్డులో పోయే స్థలాలకూ

ఆటోమేటిక్‌ ఫీజు

సాక్షి, వరంగల్‌: దరఖాస్తుదారులను ఎల్‌ఆర్‌ఎస్‌ బెంబేలెత్తిస్తోంది. 2020 ఆగస్టు 31కి ముందు కొనుగోలు చేసిన సేల్‌ డీడ్‌ ప్రకారమే ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీలు విధించాలి. కానీ, తాజా మార్కెట్‌ విలువతోపాటు మార్కెట్‌ రేటును మించి మూడింతలు చార్జీలు విధిస్తుండడంతో అయోమయంలో ఉన్నారు. అదేవిధంగా క్షేత్రస్థాయి సందర్శన లేకుండానే వరంగల్‌ నగర మాస్టర్‌ప్లాన్‌ రోడ్డులో పోయే ప్లాట్లకు సైతం ఆటోమేటిక్‌ ఫీజు వసూలు వివాదాస్పదమవుతోంది. ఫీజు చెల్లించిన తర్వాతే సదరు ప్లాట్‌ను అధికారులు క్షేత్రస్థాయి సందర్శన చేసి ఫైనల్‌ ప్రొసీడింగ్స్‌ ఇవ్వడం బాగానే ఉంది. ఒకవేళ మాస్టర్‌ప్లాన్‌, రోడ్డు డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ ప్రకారం రోడ్ల విస్తరణలో ఎంత కావాలో అంత రిజిస్టర్డ్‌ గిఫ్ట్‌ ద్వారా ఉచితంగా సంబంధిత విభాగానికి బదిలీ చేయాలనే నిబంధన కలవరపెడుతోంది. ఆటోమేటిక్‌ ఫీజు ఖరారు చేసే ముందు క్షేత్రస్థాయి సందర్శన చేసి ఎంతవరకు మాస్టర్‌ప్లాన్‌ ప్రతిపాదిత రోడ్డులో వెళ్తుందో మినహాయించి మిగిలిన విస్తీర్ణానికి డబ్బులు చెల్లిస్తే దరఖాస్తుదారులకు భారం తగ్గుతుంది. అటు రూ.లక్షల్లో ఫీజు చెల్లించి.. ఇటు ప్లాట్‌ రోడ్డు విస్తరణ కోసం ఉచితంగా ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు.

ట్యాబ్‌లు రాగానే క్షేత్రస్థాయి పరిశీలన..

చెరువుల ఎఫ్‌టీఎల్‌కు 200 మీటర్ల పరిధి ప్రభుత్వ భూములకు ఆనుకుని ఉన్న సర్వే నంబర్లు మినహా మిగిలిన సర్వే నంబర్లలోని ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులకు ఆటోమేటెడ్‌గా ఫీజు ఖరారు చేస్తున్నారు. మార్చి 31లోగా ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లిస్తేనే 25 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం నాటికి మరో 35,000 మందికి ఆటోమేటిక్‌ ఫీజు జనరేట్‌ చేశారు. వీటిలో ఫీజు చెల్లించిన వారి ప్లాట్లను అధికారులు సందర్శించి ఫైనల్‌ ప్రొసీడింగ్స్‌ ఇవ్వనున్నారు. మరో రెండు రోజుల్లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో కూడిన ట్యాబ్‌లు రాగానే ఈ క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందని ఓ అధికారి తెలిపారు. ఒకవేళ క్షేత్రస్థాయి సందర్శన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఉందని తిరస్కరిస్తే పది శాతం ఫీజు మినహాయించుకొని మిగతాది చెల్లిస్తామని అన్నారు.

ఫీజులో ఎంత తేడా..

● వడ్డేపల్లిలోని విజయపాల్‌కాలనీ ఫేజ్‌–2లో 1981లో 250 గజాల స్థలాన్ని ఎం.సుధారాణి సేల్‌ డీడ్‌ ప్రకారం రూ.1250కు కొనుగోలు చేశారు. ఈ ప్లాట్‌ క్రమబద్ధీకరణకు ఆమె దరఖాస్తు చేసుకున్నారు. ఈ సమయంలో సమర్పించిన సేల్‌ డీడ్‌ ఉన్న సంవత్సరం ఆధారంగానే చార్జీలు విధించాలి. బెటర్‌మెంట్‌ చార్జీలు రూ.25,080, ఓపెన్‌ స్పేస్‌ చార్జీలు రూ.175 కలుపుకొని రూ.25,255 రావాలి. ఇందులో 25 శాతం రిబేట్‌ పోగా.. రూ.18,942 ఫీజు రావాలి. కానీ, అధికారులు చేసిన తప్పుడు మార్కెట్‌ విలువతో ఏకంగా రూ.7,41,806 ఫీజు రావడంతో లబోదిబోమంటున్నారు. రెగ్యులేషన్‌ చార్జీలు రూ.41,086 వస్తే ఓపెన్‌ స్పేస్‌ చార్జీలు ఏకంగా రూ.ఏడు లక్షలు రావడంతో కంగుతిన్నారు. ఇక్కడ ప్రస్తుత మార్కెట్‌ విలువ గజానికి రూ.ఏడు వేలు ఉంటే ఏకంగా రూ.20,000 నిర్ధారించడం వల్లే ఇదంతా జరిగింది.

● విమలకు కాజీపేటలో ఉన్న 600 గజాల స్థలానికి రెగ్యులైజేషన్‌ చార్జీలు రూ.70,235 వస్తే ఓపెన్‌ స్పేస్‌ చార్జీ రూ.9,800 మాత్రమే వచ్చింది. నగరశివారు ప్రాంతం స్తంభంపల్లి శివారులో 216 గజాలకు క్రమబద్ధీకరణ చేసుకోవడానికి రంగు ఉమాదేవి రూ.32,644 చెల్లించాలి. కానీ, తప్పుడు ఎంట్రీతో రూ.1,87,435 చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది.

న్యూస్‌రీల్‌

గ్రేటర్‌ పరిధిలో వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల వివరాలు..

దరఖాస్తులు పరిశీలించినవి ఫీజు చెల్లించింది ప్రొసీడింగ్‌లు

1.10 లక్షలు 40 వేలు 14,088 మంది 680 మందికి

ఎస్‌ఎంఎస్‌లు షార్ట్‌ఫాల్స్‌ ఆటోమేటిక్‌ ఫీజు జనరేట్‌

25,000 మందికి 15వేల మందికి 35,000 మందికి

ఈ విధంగా చేస్తే మేలు..

‘2012, 2015–16, 2018 మాదిరిగానే ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ చేపట్టాలి. అప్పుడు తొలుత రూ.పది వేలు చెల్లించిన తర్వాత లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల సహకారంతో క్షేత్రస్థాయి సందర్శన చేశాకే ఫీజు చెల్లించాలంటూ ఎస్‌ఎంఎస్‌లు పంపితే చెల్లించారు. ఇప్పుడు కూడా దరఖాస్తులు పరిశీలించిన తర్వాతే ఫీజు తీసుకోవాలి. 2020 ఎల్‌ఆర్‌ఎస్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వాలి. లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమించుకుంటేనే తప్పులు దొర్లే అవకాశం ఉండదు. ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రొసీడింగ్స్‌లో గతంలో మాదిరిగానే డాక్యుమెంట్‌ నంబర్‌, ప్లాన్‌ను పొందుపరచాలి. లేదంటే భవన నిర్మాణసమయంలో దరఖాస్తుదారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశముంది’ అని బల్దియాలోని ఓ ప్లానింగ్‌ అధికారి తెలిపారు.

వరంగల్‌1
1/1

వరంగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement