నెక్కొండ: అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. బొల్లికొండ గ్రామంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 12 ఏళ్ల తర్వాత పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. నిబంధనల ప్రకారం పునాది తీసిన వెంటనే యాప్ సాయంతో ఇంటి నిర్మాణ స్థితిని ప్రభుత్వానికి నివేదిస్తారని పేర్కొన్నారు. అప్పుడే లబ్ధిదారుడి ఖాతాలో రూ.లక్ష జమ అవుతుందని ఆయన వివరించారు. గతంలో మంజూరైనా ఇళ్లు నిర్మించుకోని వారికి తప్పకుండా ఇళ్లు మంజూరు చేసి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. గ్రామానికి 120 ఇళ్లు మంజూరయ్యాయని, ఇంకా అర్హులున్నా ఇళ్ల మంజూరుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి, పెండెం రామానంద్, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు బక్కి అశోక్, పెండ్యాల హరిప్రసాద్, మాజీ సర్పంచ్ బానోత్ శ్రీధర్, నర్సంపేట కోర్టు ఏజీపీ బండి శివకుమార్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఏర్సు తిరుపతి, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్, హౌసింగ్ డీఈ పందెం విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు చల్లా శ్రీపాల్‌రెడ్డి, కుసుమ చెన్నకేశవులు, కేవీ. సుబ్బారెడ్డి, కొమ్మారెడ్డి సుధాకర్‌రెడ్డి, గై లక్ష్మణ్, కర్ర చెన్నారెడ్డి, ఊడ్గుల అశోక్, సముద్రాల కనకయ్య, రామారపు రాము పాల్గొన్నారు.
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
బొల్లికొండలో నిర్మాణ
పనులకు శంకుస్థాపన