
56
క్షేత్రస్థాయిలో దృష్టి సారించని అధికారులు
సమస్యలు తీర్చాలని మళ్లీ ప్రజల దరఖాస్తులు
కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ (కుడా), పోలీసు శాఖకు వచ్చిన వినతులను అధికారులు పరిష్కరించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సమస్యలపై 202 మంది దరఖాస్తులు సమర్పించగా 10 మాత్రమే పరిష్కారం అయ్యాయి. అదేవిధంగా పోలీసు శాఖలో 123 సమర్పిస్తే మూడు మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. జిల్లా పరిషత్ పరిధిలో 116 ఫిర్యాదులు వస్తే రెండు మాత్రమే పరిష్కారం అయ్యాయి. కుడా పరిధిలో 107కు ఒకటి, నర్సంపేట ఏసీపీ పరిధిలో 45 వస్తే ఒకటి, ఈస్ట్‌జోన్ పోలీసు అధికారి పరిధిలో 43 వస్తే మొత్తం పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇలా అన్ని శాఖల్లోని సమస్యలపై వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
దరఖాస్తుల స్వీకరణకే ప్రజావాణి..
ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం అందించాలని ఆరు నెలలుగా ప్రజావాణిలో దరఖాస్తులు అందిస్తున్నాం. అయినప్పటికీ సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రజావాణి కేవలం దరఖాస్తులు సమర్పించేందుకు నిర్వహిస్తున్నట్లు భావిస్తున్నాం.
– గంగుల దయాకర్, ఇన్నర్‌రింగ్ రోడ్డు భూబాధితుల సమాఖ్య అధ్యక్షుడు
మూడు నెలలుగా వస్తున్నా..
ఉమ్మడి ఆస్తికి సంబంధించిన సమస్య పరిష్కరించాలని డిసెంబర్ 2న జరిగిన ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చాను. పరిష్కారం కాకపోవడంతో మళ్లీ వచ్చి ఈనెల 10న జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
– చిలుక సుధాకర్, పైడిపల్లి

56

56

56

56