
ఘనంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు
నెక్కొండ: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఆదివారం గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. 1975–76 సంవత్సరంలో పదో తరగతి చ దివిన వారు సుమంగళి ఫంక్షన్‌హాల్‌లో కలుసుకొని జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువు మల్లయ్యతోపాటు మృతి చెందిన ఉపాధ్యాయుల కుమారులను సన్మానించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్సాహంగా గడిపారు. పూర్వ విద్యార్థులు కృష్ణమూర్తి, చింతకింది అశోక్, సంజీవరెడ్డి, గరికపాటి కృష్ణారావు, రాములు, నల్ల రాములు, చల్లా రఘోత్తంరెడ్డి, హుస్సేన్ ఉన్నారు.