సాక్షి, వరంగల్: జిల్లాలో గతేడాది జరిగిన ఆశవర్కర్ల నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులపై కనీస విచారణ లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత డీఎంహెచ్‌ఓ ఉన్న సమయంలో ఇన్‌చార్జ్ డిస్ట్రిక్ పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నియమ నిబంధనలు పాటించకుండానే అక్రమ నియామకాలు జరిగాయని గతేడాది ఆగస్టు 24న హైదరాబాద్‌లోని ఆరోగ్య, కుటుంబ విభాగంలోని ఉన్నతాధికారులకు సామాజిక కార్యకర్త ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అక్కడి అధికారులు ఆశవర్కర్ల నియామకాలపై విచారణ జరిపి తగుచర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చినా.. ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేకపోవడం గమనార్హం. అయితే కొద్ది నెల ల క్రితం కొత్తగా జిల్లా వైద్యారోగ్య విభాగాధికారిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ సాంబశివరావు ఆశల అక్రమ నియామకాలపై లోతుగా విచారించి బా ధ్యులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వస్తోంది. జిల్లాలో 16 మంది ఆశవర్కర్ల నియామకాలు నిబంధనలకు విరుద్ధంగానే జరగడంతో అర్హులకు అన్యాయం జరిగిందనే టాక్ వస్తోంది. చాలా నియామకాల్లో అదే మండలానికి చెందిన వారిని కాకుండా, ఇతర మండలాలకు చెందిన వారిని నియమించడంతో జోరుగా చర్చ జరుగుతోంది. వర్ధన్నపేట, రా యపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు అ క్కడి సబ్ సెంటర్లలో నలుగురి నియామకాలు ని బంధనలకు విరుద్ధంగా జరిగాయని సదరు ఫిర్యాదులో పేర్కొన్నా.. ఇప్పటివరకు ఎ లాంటి చర్యలు లేకపోవడంతో ఉన్నతాధికారులు కావాలనే దీనిని పక్కన బెడుతున్నారన్న చర్చ జరుగుతోంది. ఆశవర్కర్ల నియామకాల్లో అవకతవకలపై డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావును సంప్రదించగా ఈ విష యం తన దృష్టిలో లేదని సమాధానమిచ్చారు.
నిబంధనలకు విరుద్ధంగా ఆశవర్కర్ల నియామకాలు
అనర్హులపై నెలలు గడుస్తున్నా..
కానరాని చర్యలు
డీఎంహెచ్‌ఓ దృష్టి సారిస్తేనే
వెలుగులోకి నిజాలు