హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన వినతుల్ని ఆయా శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి స్వీకరించిన వినతులపై అధికారులు అలసత్వంగా వ్యవహరించవద్దని, వాటికి సత్వరమే పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 120 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ వైవీ.గణేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, ఆర్డీఓ, నారాయణ, తహసీల్దార్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
వితంతు పెన్షన్ కోసం వచ్చాం..
నాభర్త చనిపోయాడు. చాలా రోజులుగా వితంతు పింఛన్ కోసం చూస్తున్నాం. గతంలో స్థానికంగా అధికారులకు వినతులు ఇచ్చాం. ఈసారి కలెక్టర్‌కు ఇద్దామని వచ్చాం. నాకు పాప ఉంది. ఇతర జీవనాధారం లేదు.
– కన్నెబోయిన సరిత, వంగపహాడ్
ప్లాట్ రెగ్యులరైజ్ కోసం ఫీజు కట్టాం..
గతంలో ప్రభుత్వం నోటరీ ప్లాట్లు రెగ్యులరై జ్ చేస్తామని చెప్పడంతో మీసేవ కేంద్రంలో రూ.1,000 ఫీజు కట్టాం. తర్వాత ఆవిషయంలో ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. అధికారులు ప్లాట్ రెగ్యులరైజ్ చేస్తే మిగతా డబ్బులు చెల్లిస్తాం.
– ఆకుగల సుగుణ, మారుతీనగర్, వడ్డేపల్లి
చిరు వ్యాపారం చేస్తా రుణమివ్వండి..
మాది హనుమకొండ కుమార్‌పల్లి ప్రాంతం. నేను ప్రభుత్వం నుంచి రుణ సాయం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశా. ఇప్పటి వరకు రాలేదు. ప్రభుత్వంపై నమ్మకంతో నాకు రుణ సాయం చేస్తే చిన్న పాటి వ్యాపారం చేసుకుంటా. రుణం క్రమం తప్పకుండా తిరిగి చెల్లిస్తా.
– బానోత్ రవి, కుమార్‌పల్లి
దివ్యాంగురాలి బాధ్యత మాదే..
నా కూతురు, అల్లుడు చనిపోయారు. వారి కూతురు మానసిక దివ్యాంగురాలు. ఆమె బాధ్యతలు కూడా మేమే చూడాలి. అలాంటి పిల్లతో అద్దె ఇంట్లో ఉండలేకపోతున్నాం. మాకున్న ఇంటి స్థలం రోడ్డు విస్తరణలో పోయింది. కొంత మాత్రమే మిగిలింది. అయితే ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేస్తే అందులో మా పేరు లేదు. అధికారులు మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూడాలి.
– గాజుల సరోజన, సమ్మయ్య, శాయంపేట
అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి
120 అర్జీల స్వీకరణ
వినతులు త్వరగా పరిష్కరించండి
వినతులు త్వరగా పరిష్కరించండి
వినతులు త్వరగా పరిష్కరించండి
వినతులు త్వరగా పరిష్కరించండి