
‘సన్న బియ్యం’ పేదల ఆత్మగౌరవ పథకం
పరకాల/దామెర/నడికూడ/ఆత్మకూరు: సన్న బియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవ పథకమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పరకాల, నడికూడ, దామెర, ఆత్మకూరు మండలాల్లో పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈపథకం చరిత్రలో నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా.. రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ ద్వారా రాష్ట్రంలో రూ.6 వేల కోట్లు అదనపు భారం పడుతున్నా.. ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎల్లవేళలా పేదల గురించి ఆలోచించే పార్టీ ఒక్క కాంగ్రెస్ మాత్రమేనన్నారు. ఎమ్మెల్యే వెంట అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
ప్రతి ఒక్కరూ సన్నబియ్యంతో
భోజనం చేయాలి: మార్నేని
ఐనవోలు: తెలంగాణలో రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ సన్నబియ్యంతో భోజనం చేయాలనే సంకల్పంతో సీఎం రేవంత్‌రెడ్డి పథకాన్ని ప్రారంభించినట్లు టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
నియోజకవర్గంలో పథకం ప్రారంభం

‘సన్న బియ్యం’ పేదల ఆత్మగౌరవ పథకం