హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం గులాబీ రంగు గన్నేరు పూలతో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అమ్మవారికి పూర్ణాభిషేకం, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం వేద పండితులు, వేద పాఠశాల విద్యార్థులు గులాబీ రంగు గన్నేరు పూలకు సంప్రోక్షణ నిర్వహించి వాటితో అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. ఆలయ ఈఓ శేషుభారతి, దేవాలయ సిబ్బంది పర్యవేక్షించారు.
వేయిస్తంభాల ఆలయంలో మహా సుదర్శన హోమం
హన్మకొండ కల్చరల్: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల ఆలయంలో జరుగుతున్న శ్రీరా మనవమి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూడో రోజు మహా సుదర్శన హోమం నిర్వహించారు. మంగళవారం ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు రుద్రేశ్వరుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. సీతారాములకు ప్రత్యేక పూజలు జరిపా రు. అనంతరం యాగశాలలో మహా సుదర్శన హోమం నిర్వహించారు. వెంకటేశ్వరరావు, రుక్మిణి దంపతులు, సదాశివుడు, భాగ్యలక్ష్మి దంపతులు హోమ క్రతువుకు ఉభయదాతలుగా వ్యవహరించారు.
సైబర్ క్రైమ్ ఏసీపీ విజయ్‌కుమార్ బదిలీ
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో సైబర్ క్రైమ్ ఏసీపీగా పని చేస్తున్న విజయ్‌కుమార్‌ను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఖమ్మంలో సైబర్ క్రైమ్ ఏసీపీగా పనిచేస్తున్న ఫణీందర్ వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు బదిలీపై వస్తున్నారు.
కాళేశ్వరాలయంలో భక్తుల రద్దీ
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయం శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ, శని పూజలకు భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం ముందుగా త్రివేణి సంమగ గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి స్వామివారి ఆలయంలో సామూహికంగా పూజలు నిర్వహించారు. కొంతమంది భక్తులు నవగ్రహాల వద్ద శనిపూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేశారు. దీంతో ఆలయ పరిసరాలు, గోదావరి తీరం వద్ద భక్తులతో సందడి వాతావరణం కనిపించింది.

భద్రకాళి అమ్మవారికి పుష్పార్చన