
ఎండుతున్న మిర్చి పంట
● పరకాల మండలంలో
10 వేల క్వింటాళ్ల దిగుబడి నష్టం
పరకాల: మండుతున్న ఎండలు, భూగర్భజలాలు అడుగంటుతుండడంతో పరకాల మండలంలో మిర్చి పంట ఎండుతోంది. పంటకు సరిగ్గా నీరందకపోవడంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోతోంది. పరకాల మండలంలో సుమారు 2 వేల ఎకరాల వరకు మిర్చి సాగు చేశారు. 50 వేల క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా.. 40 వేల క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. దీంతో 10 వేల క్వింటాళ్ల దిగుబడి నష్టపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు పెద్దగా దిగుబడి లేకపోయినప్పటికీ మార్కెట్‌లో మద్దతు ధర కూడా కరువు కావడంతో మిర్చి సాగు చేసిన రైతుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.