
క్షేత్రస్థాయి పరిస్థితులపై విశ్లేషణాత్మకంగా..
1994లో తాను ఎదుర్కొన్న సంఘర్షణను బట్టి ‘మహిళలపై హింస–మండుటెండు గాయాలు’ రచన చేసింది. పత్రికల్లో బీడీ దమయంతి పేరిట సల్వాజుడుం విధ్వంసం తీరుపై ‘పచ్చని బతుకుల్లో కురుస్తున్న నిప్పులు’, ఆదివాసీ భూపోరాటాల విజయపథంలో ‘విముక్తి బాటలో నారాయణఖేడ్’, భూఆక్రమణలు చేపడుతూ వడ్డీ వ్యాపారుల ఆగడాలు, ఆదివాసీ, దళితుల మధ్య పాలకుల చిచ్చు అంశాలపై మీడియా రూపంలో క్షేత్ర స్థాయిలో విశ్లేషణాత్మక అధ్యయనాలు చేసి మావోయిస్టు అగ్రనేత రామకృష్ణతో పర్యటన చేసింది. సింగన్ మడుగు ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరిట అడవిలో ఆరు ఊర్లను తగులబెట్టిన నేపథ్యంపై ఆమె చేసిన రచనలు తుపాకీ తూటాల కంటే రెట్టింపులో పేలి ప్రజాచైతన్యానికి ఊపిరిలూదినట్లు చెబుతుంటారు. యుక్త వయసులో ఓ ఇంటి ఆవిడగా సంఘర్షణ పడి సమ సమాజ స్థాపన కోసం అడవిబాట పట్టిన ఉద్యమ కెరటం రేణుక ప్రస్థానం దంతెవాడ ఎన్‌కౌంటర్‌తో ముగిసినా మెట్లమీద మిడ్కో(మిణుగురు పువ్వు) పేరిట ఆమె రచనలు, సాహిత్యం ఎప్పటికీ గుర్తుండిపోతుందని సాహిత్యాభిమానులు అంటున్నారు.