
ఎస్సారెస్పీ కెనాల్‌లో వ్యక్తి గల్లంతు
వర్ధన్నపేట: బట్టలు ఉతుక్కోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి కాలు జారి కాల్వలో గల్లంతైన సంఘటన ఇల్లందలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఇల్లంద గ్రామానికి చెందిన మునుకుంట్ల సదయ్య బుధవారం మధ్యాహ్నం కుమ్మరిగూడెం సమీపంలో ఉన్న ఎస్సారెస్పీ కెనాల్‌లో బట్టలు ఉతుక్కోవడానికి సైకిల్‌పై వెళ్లాడు. సైకిల్‌ను బ్రిడ్జిపై నిలిపి చెప్పులు, సంచి అక్కడ వదిలి కాల్వ మెట్ల ద్వారా కిందకు దిగాడు. బట్టలు ఉతుక్కుంటున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయి కాల్వలో కొట్టుకుపోతుండగా ఇల్లంద ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చూసినట్లు తెలిసింది. వారు వెంటనే గ్రామస్తులకు తెలుపగా బ్రిడ్జిపైన నిలిపిన సైకిల్, చెప్పులు, సంచి, సంచిలో ఉన్న సెల్‌ఫోన్‌ను చూసి అవి మునుకుంట్ల సదయ్యకు చెందినవిగా గుర్తించారు.