
వరంగల్
శుక్రవారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
‘సహకార’ బలోపేతానికి కృషి
పీఏసీఎస్‌ల బలోపేతానికి అధ్యక్షులు, సీఈఓలు కృషి చేయాలని టీజీ కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు అన్నారు.
– 8లోu
నల్లబెల్లి: మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం సీ్త్రనిధి రుణాలు పంపిణీ చేస్తోంది. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించిన వారికి మరింత పెంచి అందిస్తోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టిసారించి లక్ష్యానికి అనుగుణంగా సభ్యులకు రుణాలు అందేలా క్రమం తప్పకుండా సమీక్ష చేస్తూ, సభ్యుల వ్యాపారాభివృద్ధికి తోడ్పడుతున్నారు. రుణాల పంపిణీ, వసూళ్లపై దృష్టి సారిస్తున్నారు. రెండేళ్లుగా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మహిళలకు రుణాలు అందిస్తూ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలకు సీ్త్రనిధి రుణాలు లక్ష్యానికి మించి అందించారు. అంతేకాదు అందించిన రుణాల వసూళ్లు కూడా లక్ష్యానికి అనుగుణంగా ఉండడం విశేషం. 2023–2024 ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు రూ.558.21 కోట్ల రుణాలు మంజూరు చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. 2,227 స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు లక్ష్యాన్ని మించి రూ.584.23 కోట్లు పంపిణీ చేశారు. దీంతో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచి ఆదర్శంగా ఉంది. కాగా, హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క.. డీఆర్డీఓ కౌసల్యాదేవికి అవార్డును ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు.
వ్యాపారాభివృద్ధికి రుణాలు..
రుణాలు తీసుకున్న సభ్యులు తమ వ్యాపార అభివృద్ధికి వినియోగించుకుంటున్నారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లింపులు, పొదుపు చేసేలా అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు. తీసుకున్న రుణాలను తమ వ్యాపార అభివృద్ధికి వినియోగించుకుంటున్నారు. రుణాలను నెలవారీగా చెల్లించడంతో వారికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. దీంతో పలువురు స్వయం ఉపాధి పొందుతూ తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. తమతో పాటు మరికొందరికీ ఉపాధి చూపుతున్నారు. సభ్యుల వ్యాపార అవసరాలకు రుణాలు కావాలని ముందుకు వస్తే అర్హులను గుర్తించి రుణాలు అందిస్తామని అధికారులు చెబుతున్నారు.
న్యూస్‌రీల్
రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలో నిలిపిన అధికారులు
టార్గెట్ రూ.558.21 కోట్లు.. అందించింది రూ.584.23 కోట్లు
లక్ష్యానికి మించి పొదుపు సంఘాలకు రుణాల పంపిణీ
డీఆర్డీఓ కౌసల్యాదేవికి అవార్డు ప్రదానం చేసిన మంత్రి సీతక్క
మండలాల వారీగా పంపిణీ చేసిన రుణాల వివరాలు (రూ.లక్షల్లో)
మండలం రుణాల పంపిణీ గ్రామైక్య ఎన్‌హెచ్‌జీలు సభ్యులు
లక్ష్యం సంఘాలు
చెన్నారావుపేట 582.24 594.46 20 222 614
దుగ్గొండి 360.92 232.97 12 82 233
గీసుకొండ 523.6 694.87 26 270 736
ఖానాపురం 461.83 662.72 18 238 716
నల్లబెల్లి 542.52 342.22 24 168 353
నర్సంపేట 645.19 839.46 26 340 876
నెక్కొండ 570.64 877.13 26 338 1,046
పర్వతగిరి 385.67 268.57 14 100 310
రాయపర్తి 473.17 355.42 17 124 377
సంగెం 556.37 507.32 19 185 541
వర్ధన్నపేట 480.04 467.19 17 160 498
మొత్తం 5,582.19 5,842.33 219 2,227 6,300

వరంగల్