
దొడ్డి కొమురయ్యను ఆదర్శంగా తీసుకోవాలి
అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి
హన్మకొండ అర్బన్: తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి అన్నారు. దొడ్డి కొమురయ్య 98వ జయంతిని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అయన మాట్లాడుతూ.. కడవెండి గ్రామంలో గొర్రెల కాపరుల కుటుంబంలో జన్మించిన కొమురయ్య ఒక మహోన్నత ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ వైవీ.గణేశ్, బీసీ వెల్ఫేర్ అధికారి రాంరెడ్డి, జిల్లా కోశాధికారి శ్రీనివాస్‌కుమార్, జిల్లా టూరిజం అధికారి శివాజీ, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా కార్యదర్శి ఆసనాల శ్రీనివాస్, గౌడ సంఘం అధ్యక్షుడు రామస్వామి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్యామ్, ఎన్జీఓ నాయకులు మండల పరశురాములు, వివిధ కుల సంఘ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
అభ్యసన సామర్థ్యాలు పెంచాలి
విద్యారణ్యపురి: విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు పెంచాలని, సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని హనుమకొండ డీఈఓ వాసంతి కోరారు. జిల్లాలో గతేడాది పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు రెండ్రోజుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించి మాట్లాడారు. ఉపాధ్యాయులు అభ్యసనాభివృద్ధి సమర్థవంతంగా అమలు చేస్తూ విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచాలన్నారు. విద్యార్థులను పాఠశాలలపైపు ఆకర్శించేలా టీచర్లు కృషి చేయాలన్నారు. శిక్షణలో జిల్లా క్వాలిటీ సెల్ కో–ఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం కె.రమేశ్‌బాబు, హెచ్‌ఎంల అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.రామకృష్ణ, రిసోర్స్‌పర్సన్లు మల్లారెడ్డి, మనోహర్‌నాయక్, తాడూరి శ్రీనివాస్, సంపత్‌కుమార్, రవికుమార్, వాసుదేవరావు, బాలమురళీకృష్ణ, గ్రేసమ్మ తదితరులు పాల్గొన్నారు.