నర్సంపేట: ఆశ వర్కర్ల నియామకంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌ఓ)ను విధుల నుంచి తొలగించాలని బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు డిమాండ్ చేశారు. పట్టణంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ నుంచి నోటిఫికేషన్ జారీ అయిన తర్వాతే ఆశవర్కర్ల నియామకాలు చేపట్టాలని, నిబంధనలకు విరుద్ధంగా సదరు అధికారి 20 మందిని ఎలా నియమించారని ఆయన ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల రమేశ్, హమాలీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మీనారాయణ, సారయ్య తదితరులు పాల్గొన్నారు.