
కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్
● నేటి నుంచి నెల రోజులపాటు అమలు
● పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడి
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 30 రోజుల పాటు సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారంనుంచి మే 5 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి మైకులు, డీజేలు వినియోగించరాదని హెచ్చరించారు. సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులను నిషేధించినట్లు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మద్యం సేవించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శబ్ద కాలుష్య నియంత్రణలో భాగంగా డీజే సౌండ్‌ను నిషేధించామని, ఆస్పత్రులు, విద్యాలయాలకు 100 మీటర్ల దూరం వరకు వినియోగించరాదని, మైకులు వినియోగించాల్సి వస్తే స్థానిక ఏసీపీల అనుమతి తప్పనిసరని వివరించారు. మైకులకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సమయంలో అనుమతి తీసుకుని వినియోగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సిటీ పోలీస్ యాక్ట్ ఉత్తర్వులను కమిషనరేట్ పరిధిలో ఎవరు అతిక్రమించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆయుష్ ఉద్యోగుల
వేతనాలు పెంచాలి
గీసుకొండ: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ ఉద్యోగులకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐఎన్‌టీయూసీ అనుబంధ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేశ్ కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆయుష్ ఉద్యోగులకు నెలకు రూ.13,800 చెల్లిస్తుందని, ఇందులో కటింగ్ పోను రూ.10,200 చేతికి వస్తున్నాయన్నారు. ఈ జీతం చాలక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, 2014 లోపు నియమితులైన వారిని రెగ్యులర్ చేయాలని, డిప్యూటేషన్లను రద్దుచేసి నియామకమైన చోటే పనిచేసేలా చూడాలని, సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవాలని ప్రభుత్వాన్ని కోరారు.
జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో
రాష్ట్ర జట్టుకు 8వ స్థానం
గీసుకొండ: ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ్ స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి సీనియర్ ఖోఖో పోటీల్లో శనివారం రాష్ట్ర జట్టు 8వ స్థానం సాధించిందని టీం శిక్షణ ఇన్‌చార్జ్ కోట రాంబాబు తెలిపారు. క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారని, త్వరలో మేఘాలయలో జరిగే జాతీయస్థాయి క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్ర జట్టు అర్హత సాధించిందని ఆయన పేర్కొన్నారు.
రాములోరి పెళ్లికి
గోటి తలంబ్రాలు
దుగ్గొండి: మండలంలోని నాచినపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఈసారి ‘మన ఊరి రాముడికి మన తలంబ్రాలు’ పేరుతో బైరెడ్డి నిరంజనాదేవి ఇంట్లో మహిళలు గోటి తలంబ్రాలు తయారు చేశారు. శనివారం సాయంత్రం వరకు 11 కిలోల గోటి తలంబ్రాలు సిద్ధం చేసినట్లు నిరంజనాదేవి తెలిపారు. ఆదివారం తలంబ్రాలను ఆలయానికి తీసుకువెళ్లనున్నట్లు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో పుచ్చకాయల అరుణ, అండృ సఽంధ్యారాణి, బొమ్మినేని రమాదేవి, బైరెడ్డి కళావతి, రావుల కవిత, శైలజ, రిత్విక తదితరులు పాల్గొన్నారు.

కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్

కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్