
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
● డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి
విద్యారణ్యపురి: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం నిర్వహిచిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు విడుదల చేయాలని, మొదటి పీఆర్సీ గడు వు 2023తోనే ముగిసినందున నివేదికను తెప్పించుకొని వేతనాలను సవరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, ఉద్యోగ విరమణ పొందినవారికి బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్, ఉపాధ్యక్షురాలు ఎస్.సుభాషిని, డి.రమేశ్, కార్యదర్శి ఎన్.భాస్కర్, రాష్ట్ర కౌన్సిలర్లు జి.ఉప్పలయ్య, ఎం.సారంగపాణి, గంగాధర్ పాల్గొన్నారు.