
రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర
● డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ
గీసుకొండ/సంగెం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు పన్నుతుందని, అంబేడ్కర్ బోధనలు, వారు చూపిన మార్గాలను గ్రామాల్లో ప్రచారం చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పిలుపునిచ్చారు. సోమవారం గీసుకొండ, సంగెం మండలాల్లో చేపట్టిన ‘జై బాపు, జై అంబేడ్కర్, జై సంవిధాన్’ పేరిట మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు. సత్యం, అహింస మార్గాల్లో నడుస్తామని, సమసమాజ స్థాపనకు పాటుపడతామని ఆమె కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీమగాని సౌజన్య, కార్యక్రమ నియోజకవర్గ కోఆర్డినేటర్ కూచన రవళి, కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మాదవరెడ్డి, తుమ్మనపెల్లి శ్రీనివాస్, కిశోర్, కట్ట య్య, రుద్రప్రసాద్, రమేశ్, రవీందర్, సాంబరె డ్డి, రాజు, రవికుమార్, జగన్నాథచారి, సంద్య, పాష, కవిత, తదితరులు పాల్గొన్నారు.
41 రోజులపాటు హోమం
గీసుకొండ: మండలంలోని కొనాయమాకుల సమీపంలో గల ప్రసిద్ధ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో 41 రోజుల పాటు హో మం నిర్వహిస్తున్నారు. మార్చి 30న హనుమాన్ 41 రోజుల మండల దీక్షలు ప్రారంమై న రోజు నుంచి ముగిసే వరకు హోమం నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్తలు సీతా ఆనంద్ సా, కుమార్‌సా సోదరులు సోమవారం తెలిపా రు. ప్రతీరోజు ఉదయం గణపతి, నవగ్రహ, రుద్ర పూజలు నిర్వహిస్తామని, చివరి రోజు పూర్ణాహుతితో హోమం ముగుస్తుందన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు జాగర్లపూడి అయ్యప్పశర్మ, తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన నామినేషన్ల
ఉపసంహరణ
● 11న పోలింగ్.. అనంతరం ఫలితాలు
వరంగల్ లీగల్: వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాలు 2025–26ల ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ సోమవారం ముగిసింది. ఈమేరకు బరిలో ఉన్న అభ్యర్థులు ఈనెల 11న జరిగే ఎన్నికల్లో తలబడనున్నారు. కాగా.. నామినేషన్ల సీకరణ రోజునే కొన్ని పోస్టులు ఏకగ్రీవం కాగా నామినేషన్ల ఉపసంహరణతో మరికొన్ని కూడా ఏకగ్రీవమయ్యాయి.
బరిలో ఉన్న అభ్యర్థులు వీరే...
వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష స్థానానికి ఈ.ఆనంద్‌మోహన్, వి.కోటేశ్వర్‌రావు, వి.సుధీర్, ప్రధాన కార్యదర్శి స్థానానికి బి.అనిల్‌కుమార్, ఆర్.నాగేంద్రచారి, పి.ప్రవీణ్‌కుమార్, డి.రమాకాంత్, జి.శివ బరిలో నిలిచినట్లు ఎన్నికల అధికారులు సీహెచ్ చిదంబర్‌నాథ్, టి.శ్రీధర్ తెలిపారు. జాయింట్ సెక్రటరీ స్థానానికి ఎ.కమలాకర్, ఎం.శ్రీధర్, వి.విష్ణుప్రసాద్, జాయింట్ సెక్రటరీ (మహిళా) కె.గోపికారాణి, ఆర్.శశిరేఖ, జాయింట్ సెక్రెటరీ (స్పోర్ట్స్/కల్చరల్) ఎన్.శివప్రసాద్, జి.వెంకటరమణ, కోశాధికారి ఎస్.అరుణ, ఆర్.ప్రభాకర్, జాయింట్ సెక్రెటరీ స్పోర్ట్స్/కల్చరల్‌కు సి.మల్లేశ్, వి.రమేశ్, ఎ.సందీప్‌కుమార్, జాయింట్ సెక్రెటరీ లైబ్రరీ మహ్మద్ అజార్ పాషా, కోశాధికారి జి.నాగభూషణం, పి.ప్రవీణ్‌కుమార్, సీహెచ్ సాంబశివరావు బరిలో నిలిచినట్లు పేర్కొన్నారు.
ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు
కౌన్సెలింగ్ పూర్తి
ఎంజీఎం: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న మిడ్ లెవెల్ హెల్త్ కేర్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టులకు సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించినట్లు హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య తెలిపారు. ఈ కౌన్సెలింగ్‌కు 11 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్‌కు సంబంధించి ఒక్క అభ్యర్థీ హాజరు కాలేదని, అలాగే దివ్యాంగుల కోటాకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు లేనందుకు ఖాళీగా ఉంచినట్లు పేర్కొన్నారు. ఈకౌన్సెలింగ్‌లో డీడీ సోషల్ వెల్ఫేర్ శ్రీలత, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ గౌతమ్ చౌహాన్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి కె.రాజేశ్, సూపరింటెండెంట్ వేణుగోపాల్, సీనియర్ అసిస్టెంట్ ఫాతిమా పాల్గొన్నారు.

రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర