
పద్మశాలీల సంక్షేమానికి పెద్దపీట
మేయర్ గుండు సుధారాణి
హసన్‌పర్తి: కాంగ్రెస్ సర్కార్ పద్మశాలీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని మేయర్ గుండు సుధారాణి అన్నారు. చింతగట్టు క్యాంప్ సమీపంలో కోటి రూపాయల నిధులతో నిర్మిస్తున్న పద్మశాలీ కమ్యూనిటీ భవనానికి సోమవారం స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి మేయర్ సుధారాణి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి జీవం పోసిందన్నారు. కమ్యూనిటీ హాల్ భవనానికి ప్రభుత్వం కోటి రూపాయలు విడుదల చేసినట్లు చెప్పారు. ఈనిధులతో కమ్యూనిటీ హాల్ భవనాన్ని అధునాతనంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పద్మశాలీల అభ్యున్నతికి కృషి చేస్తూ.. వారి అభివృద్ధికి పాటుపడుతోందన్నారు. కార్యక్రమంలో కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, కార్పొరేటర్ అరుణకుమారి, కమలాపూర్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఝాన్సీరాణి, అఖిల భారత పద్మశాలీ సంఽఘం జాతీయ ఉపాధ్యక్షుడు ప్రభాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వడ్నాల నరేందర్, కార్యదర్శులు వైద్యం రాజగోపాల్, రవీందర్, జిల్లా అధ్యక్షుడు ఆడెపు రవీందర్, కార్యదర్శి గోరంటా రాజు, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు నాగరాజు, నాయకులు గడ్డం భాస్కర్, కేశవమూర్తి, సతీష్, వేముల సదానందం, దీకొండ భిక్షపతి, మాజీ సర్పంచ్ అనిల్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వీసం సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.