
మంగళవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోu
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో వివిధ రకాల సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన వినతులను ఆయా శాఖల అధికారులు జాప్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావా ణిలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రజలు అందించిన వినతులపై సంబంధిత శాఖల అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజావా ణిలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ 12, తహసీల్దార్ హసన్‌పర్తి 7, డబుల్ బెడ్‌రూం నోడల్ ఆఫీసర్ 6, ఆర్డీఓ హనుమకొండ 6తో పాటు వివిధ శాఖల సంబంధించి మొత్తం 106 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్‌ఓ వైవీ.గణేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ నారాయణ, జిల్లా అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు.
హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి..
వేసవి నేపథ్యంలో జిల్లాలోని చెరువులు, కుంటలు, బావులు, జలాశయాల వద్ద ఈతకు వెళ్లి మృత్యువాత పడకుండా రక్షణ చర్యల్లో భాగంగా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కలెక్టర్‌ను కోరారు. ఈమేరకు సోమవారం ప్రజవాణిలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. వీలైతే జలాశయాల చుట్టూ రక్షిత కంచె ఏర్పాటుతో పాటు గ్రామాల్లో చిన్న పిల్లలు, పెద్దలు సంరక్షకులు లేకుండా బావులు, జలాశయాల్లోకి ఈతకు వెళ్లవద్దని డప్పు చాటింపు చేసి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి తేరాల యుగంధర్, కార్యవర్గ సభ్యులు కొండబత్తిని రాజేందర్, సీతారామారావు, తాడూరి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
రైతులకు న్యాయం చేయాలి..
ధర్మసాగర్ మండలం ముప్పారంలో రైతుల నుంచి అక్రమంగా ఫారెస్ట్ అధికారులు తీసుకున్న భూములు వెనక్కి ఇవ్వాలనే డిమాండ్‌తో రైతులు ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రెవెన్యూ అధికారులు చెబుతున్నా.. అటవీ శాఖ అధికారులు మాత్రం రైతులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు.
వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ ప్రావీణ్య
న్యూస్‌రీల్