
బెట్టింగ్‌లపై కఠినంగా వ్యవహరిస్తాం..
ఎవరైనా క్రికెట్, ఇతర బెట్టింగ్‌లకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠినంగా వ్యవహరిస్తాం. ఈ భూతాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సులభంగా వచ్చే డబ్బు వల్ల మంచికంటే చెడు ఎక్కువ చేస్తుంది. దీని మోజులో పడి యువత తమ బంగారు భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దు. ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడినట్లుగా తెలిస్తే తక్షణమే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం.
– సన్ ప్రీత్ సింగ్, వరంగల్ పోలీస్ కమిషనర్