
రీల్స్ ఆపి రియల్ లైఫ్‌లోకి రావాలి
కమలాపూర్ : స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి రీల్స్ ఆపి రియల్ లైఫ్‌లోకి రావాలని కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రణవ్ సూచించారు. మండలంలోని ఉప్పల్‌లో మంగళవారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాష్ట్రీయ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ నాయకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే, బీజేపీ గాంధీజీ ఆశయాలను తుంగలో తొక్కి, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అవమానపరస్తోందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు చెందిన పలువురు కాంగ్రెస్‌లో చేరగా వారికి కండువాలు కప్పి ప్రణవ్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి రీల్స్ చేయడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని విమర్శించారు. నియోజక వర్గానికి సుమారు 200కు పైగా కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరై నెలలు దాటినా ఇప్పటివరకు లబ్ధిదారులకు పంపిణీ చేయలేదన్నారు. సరిగ్గా చెక్కులకు గడువు తీరే ముందు రోజు వాటిని పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ ఝాన్సీరవీందర్, వైస్ చైర్మన్ దేశిని ఐలయ్యగౌడ్, నాయకులు రమేశ్, చరణ్ పటేల్, నారాయణరెడ్డి, భిక్షపతి, మహేష్, రమేశ్, గణేష్ పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయాలి
కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్
నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రణవ్