బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

Apr 9 2025 1:44 AM | Updated on Apr 9 2025 1:48 AM

8లోu

20నుంచి ‘ఓపెన్‌’ పరీక్షలు

విద్యారణ్యపురి : జిల్లా వ్యాప్తంగా ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ వార్షిక పరీక్షలు ఈనెల 20నుంచి 26వ తేదీవరకు జరగనున్నాయి. ఈ మేరకు పరీక్షలపై మంగళవారం డీఆర్‌ఓ గణేశ్‌.. డీఈఓ వాసంతి, ఓపెన్‌ స్కూల్‌ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌ అనగోని సదానందం పాటు వివిధ శాఖల అధికారులు, డీఐఈఓ తదితరులతో సమీక్షించారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2:30నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు రెండు విడతల్లో జరుగుతాయని కోఆర్డినేటర్‌ పేర్కొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

కాజీపేట అర్బన్‌ : హనుమకొండ జిల్లాలోని బీసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే విదేశీ విద్యానిధి బీసీ ఓవర్సీస్‌ పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ వెల్ఫేర్‌ డీడీ రామ్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 30వ తేదీలోపు www.telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌

పోటీలకు ఎంపిక

వరంగల్‌ స్పోర్ట్స్‌ : సికింద్రాబాద్‌లోని లాలాపేట మున్సిపల్‌ స్టేడియంలో ఈ నెల 11, 12 తేదీల్లో జరిగే అండర్‌–19 రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులను మంగళవారం ఎంపిక చేశారు. బి.నితిన్‌ 50 కేజీల కేటగిరీలో, ఎన్‌.రాజర్శి 80 కేజీలు, జి.భరత్‌ 65 కేజీల విభాగాల్లో ఎంపికై నట్లు కార్యదర్శి పోతరాజు రాజేందర్‌ తెలిపారు.

‘కై టెక్స్‌’లో ఉద్యోగాల

భర్తీ ప్రక్రియ షురూ..

గీసుకొండ: వరంగల్‌ జిల్లాలోని గీసుకొండ–సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు(కేఎంటీపీ)లో కేరళకు చెందిన చిన్న పిల్లల దుస్తుల తయారీ కై టెక్స్‌ కంపెనీ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఈ మేరకు 25,500 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీర్లు, మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్లు, ఇన్‌చార్జ్‌లు తదితర విభాగాల్లోని ఉద్యోగాలను భర్తీచేయనుంది. రెండు రోజుల నుంచి పలువురు నిరుద్యోగులు కంపెనీ వద్దకు వచ్చి తమ బయోడేటాలు అధికారులకు సమర్పిస్తున్నారు.

నేటినుంచి ఎస్‌ఏ–2 పరీక్షలు

విద్యారణ్యపురి : ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా నేటి (బుధవారం)నుంచి అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థులకు సమ్మేటివ్‌ అసెస్‌మెంటు (ఎస్‌ఏ–2) పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలను టైంటేబుల్‌ ప్రకారం నిర్వహించాలని ఆయా డీఈఓలు హెచ్‌ఎంలను ఆదేశించారు. ఈనెల 9నుంచి 17వ తేదీ వరకు ఎస్‌ఏ–2 పరీక్షలు కొనసాగుతాయి. ఫలితాలను 23న ప్రకటించి విద్యార్థులకు క్యూమిలేటివ్‌ రికార్డులు అందజేయాల్సి ఉంటుంది. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఎస్‌ఏ–2 పరీక్షల అన్ని సబ్జెక్టుల ప్రశ్నపత్రాలను డీసీఈబీ కార్యాలయంనుంచి ఎంఈఓలకు పంపారు. అక్కడినుంచి అన్ని యాజమాన్యాల పాఠశాలల హెచ్‌ఎంలు తీసుకెళ్లారు. ఎంఈఓలు, జిల్లా నోడల్‌ అధికారులు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెడ్‌మాస్టర్లు రోజూ పాఠశాలలను తనిఖీ చేయాలని డీఈఓ వాసంతి, డీసీఈబీ కార్యదరి బి.రాంధన్‌ ఆదేశించారు.

ఎల్‌ఆర్‌ఎస్‌–2015 దరఖాస్తుల

పరిష్కారంలో ‘కుడా’ జాప్యం

ప్రభుత్వం ఆదేశించినా

పట్టించుకోని అధికారులు

పదేళ్లుగా మూడువేల మంది

అర్జీదారుల ఇబ్బందులు

ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే

సమస్య కొలిక్కి

సాక్షి, వరంగల్‌:

లేఔట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌)–2015 దరఖాస్తుదారులు రూ.10 వేల ఫీజు చెల్లించినా అవి క్లియర్‌ కాక నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. 2020 అక్టోబర్‌ 12న ఇచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ ఉత్తర్వుల్లో కూడా 2015 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై ప్రభుత్వం స్పష్టమైనా ఆదేశాలిచ్చినా ఆచరణలో మాత్రం ఎక్కడా క్లియర్‌ అయినట్లుగా కనిపించడం లేదు. పరిష్కరిస్తే రూ.కోట్లలో ఆదాయం వచ్చే అవకాశమున్నా ఆవైపుగా కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు న్నాయి. 2015లో మాన్యువల్‌గా ‘కుడా’కు కట్టిన చలాన్లు, దరఖాస్తుదారులు కూడా హనుమకొండలోని ‘కుడా’ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉంది.‘కుడా’లో 2015కు సంబంధించిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు మూడువేల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. క్లియర్‌ చేస్తే రూ.10 వేలు పోగా మిగిలిన నగదు చెల్లిస్తామని లిఖితపూర్వకంగా ‘కుడా’ అధికారులకు ఇస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

రూ.లక్షల భారం..

ఇల్లు నిర్మించుకునేందుకు కొంతమంది అనుమతి కోసం వెళ్తే ప్రస్తుతమున్న మార్కెట్‌ విలువ ప్రకారం బల్దియా అధికారులు లెక్కలు వేస్తుండడంతో రూ.లక్షల్లో ఫీజు కట్టాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇందులో ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు 14 శాతంతోపాటు కాంపౌండ్‌ ఫీజు 33 శాతం వసూలు చేస్తుండడం గమనార్హం. అదే 2020లో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రం ఇన్నాళ్లు ఇంటి నిర్మాణ సమయంలో సదరు రిసిప్ట్‌ (రూ.వెయ్యి చెల్లించింది) బల్దియా అధికారులకు ఇస్తున్నారు. దీంతో అప్పటి సేల్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రకారం ఫీజు విధిస్తుండడంతో వారికి కాస్త ఊరట లభిస్తోంది. అదేవిధానాన్ని 2015 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులు, అది కూడా రూ.10 వేలు చెల్లించినవారికి అధికారులు ఇవ్వకపోవడంతో రూ.లక్షల్లో ఫీజుకు భయపడుతున్నారు. ‘2015 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులు క్లియర్‌ చేయమంటూ దరఖాస్తులు ఇస్తే క్లియర్‌ చేస్తున్నాం. సంబంధిత పత్రాలు జతచేస్తే పరిశీలించి ఫైనల్‌ ప్రొసీడింగ్స్‌ ఇస్తున్నాం’ అని ‘కుడా’ అధికారి ఒకరు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆచరణకు నోచుకోవడం లేదన్న విమర్శలున్నాయి.

నర్సరీల్లోని మొక్కలను

సంరక్షించాలి

ఎల్కతుర్తి : వేసవిలో నర్సరీల్లోని మొక్కలు ఎండిపోకుండా ఉదయం, సాయంత్రం సమయాల్లో మొక్కలకు సరిపడా నీరు అందించాలని జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) విద్యాలత అధికారులకు ఆదేశించారు. మంగళవారం భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి, భీమదేవరపల్లి గ్రామాల్లోని నర్సరీలను ఆమె పరిశీలించారు. నర్సరీలకు అవసరమైన షేడ్‌ నెట్‌లు, నీటి సదుపాయం కల్పించాలని తెలిపారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అత్యవసరమైతే గ్రామాల్లో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆమెవెంట ఎంపీడీఓ వీరేశం, పంచాయతీ కార్యదర్శి అనంత్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.

పరిశ్రమల స్థాపనతోనే ఆర్థిక ప్రగతి

వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద

వరంగల్‌ : పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధ్యమని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ (డీఐపీసీ) సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో టీజీఐపాస్‌ కింద వివిధ శాఖలకు సంబంధించి పరిశ్రమలు నెలకొల్పేందుకు 1,365 యూనిట్ల మంజూరుకు ప్రతిపాదనలు చేయగా.. 1,076 దరఖాస్తులకు అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు. 180 ప్రతిపాదనలు అసంపూర్తిగా ఉన్నందున తిరస్కరించామని, పూర్తి సమాచారంతో తిరిగి సమర్పించాలని కోరినట్లు పేర్కొన్నారు. సమావేశంలో పరిశ్రమలశాఖ జీఎం రమేశ్‌, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌, జిల్లా రవాణా శాఖ అధికారి శోభన్‌ బాబు, అధికారులు పాల్గొన్నారు.

న్యూస్‌రీల్‌

హంటర్‌రోడ్డులోని నందిహిల్స్‌ రోడ్డు నంబర్‌–5లో వి.సౌందర్య 2009 సంవత్సరంలో 308.33 గజాల స్థలం కొనుగోలు చేశారు. ఈ స్థలం క్రమబద్ధీకరణ కోసం 2015లో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకుని రూ.10 వేల ఫీజు కూడా చెల్లించారు. ప్లాట్‌కు సంబంధించిన పత్రాలు జతచేసి ఎల్‌ఆర్‌ఎస్‌ ఫైనల్‌ ప్రొసీడింగ్స్‌ ఇవ్వాలని, రూ.10 వేలు పోగా మిగిలిన నగదు చెల్లిస్తానంటూ పలుమార్లు లిఖితపూర్వకంగా ‘కుడా’ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నా కదలిక లేదు. ఇంటి నిర్మాణ అనుమతి కోసం బల్దియాకు వెళ్తే ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు ఇప్పుడున్నా మార్కెట్‌ విలువ ప్రకారం రూ.నాలుగు లక్షలపైగా వస్తుందని సమాధానమిచ్చారు. 2015 ఎల్‌ఆర్‌ఎస్‌ ‘కుడా’ క్లియర్‌ చేస్తే అప్పటి మార్కెట్‌ విలువ సేల్‌ డీడ్‌ ప్రకారం రూ.60 నుంచి రూ.70 వేలు అవుతుంది. దీంతో ఆమె ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రొసీడింగ్స్‌ కోసం ప్రదక్షిణ చేస్తున్నారు.

ఏం చేయాలంటే...

‘కుడా’ ఎల్‌ఆర్‌ఎస్‌ వరంగల్‌ పేరుతో హనుమకొండలోని యాక్సిస్‌ బ్యాంకులో ఓపెన్‌ చేసిన అకౌంట్‌కే 2015 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులతో రూ.పది వేల ఫీజు కట్టించారు. ఆ బ్యాంకులో వివరాలు అధికారులు సేకరించి అప్పుడు ఇచ్చిన కాంటాక్ట్‌ నంబర్‌ను సంప్రదించాలి. మీరు రూ.పది వేల ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు 2015లో కట్టారు. ఇప్పటికి క్లియర్‌ చేసుకునే అవకాశముందంటూ దరఖాస్తుదారులను సంప్రదిస్తే చాలా క్లియర్‌ అవుతాయి.

ఇప్పటికే తమకు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫైనల్‌ ప్రొసీడింగ్స్‌ ఇవ్వాలని, ఫీజు చెల్లిస్తామంటూ చాలామంది లిఖితపూర్వకంగా ‘కుడా’కు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇవి కూడా క్లియర్‌ చేయాలి.

2020 ఎల్‌ఆర్‌ఎస్‌ (రూ.వెయ్యి) ఫీజు కట్టినవారికి ఇంటి నిర్మాణ అనుమతి సమయంలో అప్పటి సేల్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రకారం అనుమతి ఇస్తున్నారు. ఇది 2015 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు కూడా కల్పించాలి.

జెడ్పీ సీఈఓ విద్యాలత

బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 20251
1/3

బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 20252
2/3

బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 20253
3/3

బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement