
రాలిన మామిడి కాయలు
నల్లబెల్లి: మండలంలోని పలు గ్రామాల్లో కోతకు వచ్చిన మామిడికాయలు నేలరాలిపోగా, మొక్కజొన్న నేలవాలింది. నల్లబెల్లి, రాంతీర్థం, అర్వయ్యపల్లి, గుండ్లపహాడ్, పంతులపల్లి గ్రామాల్లో మామి డి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా గ్రామా ల పరిధిలో 90 ఎకరాల్లో సుమారు 60 టన్నుల మామిడికాయలు రాలినట్లు కౌలు రైతు నూనె భిక్షపతి తెలిపారు. అర్వయ్యపల్లి గ్రామంలో మొక్కజొన్న నేలవాలింది. నల్లబెల్లిలో విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. సోమవారొం రాత్రి విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడగా.. అధికారులు మరమ్మతు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.