
గాలి దుమారానికి కొట్టుకుపోయిన రేకులు
నెక్కొండ: గాలి దుమారానికి నిర్మాణంలో ఉన్న గేదెల షెడ్డు రేకులు కొట్టుకుపోయిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. మండలంలోని అజ్మీరా మంగ్యానాయక్ తండాకు చెందిన మాలోత్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. మామిడితోట తండాలో గేదెలకు షెడ్డు నిర్మిస్తున్నాడు. ఈ నెల 7 రాత్రి వీచిన గాలి దుమారానికి రేకులు కొట్టుకుపోగా, సిమెంట్ గోడలు కూలిపోయాయి. దీంతో సుమారు రూ.లక్ష మేర నష్టం వాటిల్లిందని వెంకన్న వాపోయాడు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆయన కోరాడు.