
గురువారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోu
వసూళ్లు
రూ.16.44 కోట్లు
ఆస్తి పన్ను బకాయి
రూ.71.58 కోట్లు
● ప్రభుత్వ శాఖల నుంచి వసూలుకు వెనుకంజ
● ప్రజలపై పన్ను మోపడంలో
ముందంజ
● నోరుమెదపని బల్దియా
రావాల్సిన బకాయిలు
రూ.71.58 కోట్లు
ఆర్థిక సంక్షోభం, నిర్వహణ ఖర్చుల భారం పేరిట ప్రజల్ని ఎడాపెడా పన్నులతో బాదేస్తున్న గ్రేటర్ వరంగల్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ శాఖ నుంచి మొదలుకొని బీఎస్‌ఎన్‌ఎల్, రైల్వే శాఖ వరకు రూ.లక్షల మేర బకాయిలున్నాయి. పారిశుద్ధ్యం, ఔట్‌సోర్సింగ్ కార్మికుల వేతనాలు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా కోసం ప్రధాన ఆదాయ వనరు ఆస్తి పన్నే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసెస్‌మెంట్లు(భవనాలు) 1,551 ఉండగా.. గత పాత, కొత్త బకాయిలు రూ.88.02 కోట్లు అయ్యాయి. కాగా.. మార్చి వరకు కేవలం రూ.16.44 కోట్లు మాత్రమే వసూలు చేయగా.. ఇంకా రూ.71.58 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి.
వరంగల్ అర్బన్: ప్రతీనెల కరెంటు బిల్లు చెల్లించకపోతే విద్యుత్ సంస్థ బల్దియాకు కరెంట్ సరఫరా కట్ చేసిన ఘటనలున్నాయి. ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ సొమ్ము చెల్లించకపోతే పెనాల్టీ లతోపాటు ఆస్తులు జప్తు చేస్తారు. వాహనాలకు ఇన్సూరెన్స్ చేయకపోతే ఆర్టీఏ వారు సీజ్ చేస్తారు. ఇలా.. గతంలో బల్దియా ఆస్తులను అటాచ్‌మెంట్ చేసిన సందర్భాలు కోకొల్లలు. కానీ.. గ్రేటర్ వరంగల్ అధికార యంత్రాంగం మాత్రం ఆస్తి పన్ను, నీటి చార్జీలు వసూలు చేయడంలో వెనుకబడింది. నిబంధనల పేరుతో సామాన్యులతో కఠినంగా వ్యవహరించే బల్దియాకు ప్రభుత్వ శాఖల విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు. ఏళ్ల తరబడి వాటి బకాయిల వసూలు లేకున్నా.. ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్నారు.
పేదోడే నయం..
గ్రేటర్‌లో 2,17,585 అసెస్‌మెంట్లు (భవనాలు) ఉన్నాయి. 2024–25 గాను కమర్షియల్, రెసిడెన్షియల్ అసెస్‌మెంట్ల ద్వారా.. రూ.117.62 కోట్లు లక్ష్యం కాగా, రూ.74.90కోట్లు వసూలు చేశారు. ఇకపోతే ప్రభుత్వాలకు సంబంధించిన 1,551 అసెస్‌మెంట్లు ఉండగా.. కేవలం 30 శాఖలు మాత్రమే ఆస్తి పన్ను చెల్లించినట్లు అఽధికారులు వెల్లడించారు.
గ్రేటర్ వరంగల్‌కు హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లతో పాటు నగర, పోలీస్ కమిషనర్, ఉన్నతాధికారులున్నారు. వీరి పర్యవేక్షణలో అన్ని శాఖలు కార్యకలాపాల్ని కొనసాగిస్తుంటాయి. ఇంత పెద్ద యంత్రాంగం ఉన్న ఆయా శాఖల ముఖ్య అధికారులతో సమావేశమై నగరంలో సుందరీకరణ, పరిశుభ్రత, రవాణా సౌకర్యం, విద్యుత్ వెలుగులు అందించే బల్దియాకు చెల్లించాల్సిన ఆస్తి, నీటి పన్నుల వసూళ్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఉంది. అందుకోసం బల్దియా మేయర్, కమిషనర్లు ఆ దిశగా చొరవ తీసుకోవాలి. కనీసం ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిల నివేదించలేకపోతున్నారు. ఇలా.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో పన్ను బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. పన్నుల వసూళ్ల నిర్లక్ష్యంపై ఆ విభాగాధికారులను వివరణ కోరగా.. కమిషనర్‌ను సంప్రదించాలని దాటవేస్తుండడం గమనార్హం.
న్యూస్‌రీల్
బల్దియాలో ఇలా..
బల్దియా మొద్దు నిద్ర
వసూళ్ల్లు 18.68%
ఉన్నతాధికారులు చొరవ చూపాలి!

గురువారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

గురువారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

గురువారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

గురువారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025