
ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి
ఖానాపురం: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.రూ.25 వేల పరిహారం అందించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని ఆరెల్లి క్రాస్‌వద్ద గురువారం ఆయన వరి పంటలను పరిశీలించారు. అనంతరం పెద్ది విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వడగళ్ల వర్షం కురిసి మూడు రోజులవుతున్నా ఎమ్మెల్యే, వ్యవసాయ అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. రెండు రోజుల్లో సర్వే ప్రారంభించకపోతే రైతులతో కలిసి కలెక్టరేట్ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. రూ.మూడు చొప్పున వడ్డీకి తీసుకువచ్చి పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందని పేర్కొన్నారు. మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు వెంకటనర్సయ్య, నాయకులు వేజేళ్ల కిషన్‌రావు, వడ్డె రాజశేఖర్, ఆబోతు అశోక్, మస్తాన్, వల్లెపు సోమయ్య, మచ్చిక అశోక్, బోడ పూలు, బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి