మల్బరీ సాగు లాభదాయకం | - | Sakshi
Sakshi News home page

మల్బరీ సాగు లాభదాయకం

Apr 11 2025 12:57 AM | Updated on Apr 11 2025 12:57 AM

మల్బర

మల్బరీ సాగు లాభదాయకం

గీసుకొండ: రైతులు వరి, పత్తి , మిరప, మొక్కజొన్న పంటలకు బదులుగా మల్బరీ సాగు చేసి ఆర్థికంగా లాభపడాలని పట్టు పరిశ్రమశాఖ సంయుక్త సంచాలకురాలు అనసూయ సూచించారు. మండలంలోని దస్రుతండాలో మల్బరీ సాగుపై గురువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. మల్బ రీని రెండు ఎకరాల్లో సాగు చేస్తే రూ.మూడు లక్షల నికర ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ పంట సాగుచేస్తే ప్రభుత్వం రాయితీలు ఇస్తుందన్నారు. పట్టు పరిశ్రమల సహాయ అధికారులు అరవింద్‌, షోయబ్‌ఖాన్‌, రైతులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో

ఇద్దరికి తీవ్ర గాయాలు

నర్సంపేట రూరల్‌: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన నర్సంపేట పట్టణంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని వల్లభ్‌నగర్‌ మార్కండేయ కాలనీకి చెందిన బండ లక్ష్మయ్య రాజుపేట గ్రామ శివారులోని ఎస్టీ హాస్టల్‌లో వంటమనిషిగా పనిచేస్తున్నాడు. పనులు ముగించుకుని లక్ష్మయ్య సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తున్నాడు. మార్కండేయ కాలనీ వద్ద యూటర్న్‌ తీసుకుంటుండగా నర్సంపేట నుంచి కమలాపురం గ్రామానికి వెళ్తున్న ద్విచక్రవాహనదారుడు కొర్రె సాంబయ్య ఢీకొన్నాడు. ఈఘటనలో ఇద్దరు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే 108లో నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం బండ లక్ష్మ య్యను ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్‌ చేశారు.

నేడు ‘ప్రేమకు జై’ విడుదల

నెక్కొండ: మల్లం శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ‘ప్రేమకు జై’ సినిమా శుక్రవారం నెక్కొండ సూర్య థియేటర్‌లో విడుదల కానుంది. నెక్కొండ ముద్ద బిడ్డ బూరగాని అనిల్‌గౌడ్‌ రెండోసారి హీరోగా నటించిన ఈ సినిమా యూత్‌ను అలరించనుంది. ఆయన ‘వజ్రాలు కావాలా నాయనా’ సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు. మూడు ఫైట్స్‌, ఒక ఐటెం సాంగ్‌, శివుడి మీద ఒక సాంగ్‌ చాలా బాగుందన్న టాక్‌ వినిపిస్తోంది. యూత్‌కి నచ్చే సావరియా సాంగ్‌ ఈ సినిమాకు హైలెట్‌గా నిలువనుంది. విలన్‌గా సలార్‌ ఫేమ్‌ భాస్కర్‌, హీరోయిన్‌గా జ్వలిత నటించారు.

జాతీయ ఎస్సీ కమిషన్‌కు

కొండేటి శ్రీధర్‌ ఫిర్యాదు

వర్ధన్నపేట: సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి రోజున తనకు జరిగిన అవమానంపై వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌ గురువారం ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై సోమవారం స్థానికుడు కొండేటి బాబు, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మార్టిన్‌ లూథర్‌తో కలిసి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతోపాటు డీజీపీ, వరంగల్‌ సీపీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

‘రాజ్యాంగం’

ఆడియో సీడీ ఆవిష్కరణ

విద్యారణ్యపురి: కవి, ప్రజా కళాకారుడు, జాతీయ ఉపాధ్యాయ ఉత్తమ అవార్డు గ్రహీత డాక్టర్‌ వల్లంపట్ల నాగేశ్వర్‌రావు రచించి స్వరపరిచిన ‘మన భారత రాజ్యాంగం’ ఆడియో సీడీని వరంగల్‌ పార్లమెంట్‌ సభ్యురాలు కడియం కావ్య ఆవిష్కరించారు. గురువారం హనుమకొండలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్‌ అంపశయ్య నవీన్‌, డాక్టర్‌ వల్లంపట్ల నాగేశ్వర్‌రావు, వీఆర్‌ విద్యార్థి, పి.కృష్ణమాచారి, ప్రొఫెసర్‌ రతన్‌సింగ్‌ఠాకూర్‌, డోలి రాజలింగం, బండా కాళిదాస్‌, మండల పరశురాములు, సామాజిక కార్యకర్త నల్లమూరి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

మల్బరీ సాగు లాభదాయకం1
1/2

మల్బరీ సాగు లాభదాయకం

మల్బరీ సాగు లాభదాయకం2
2/2

మల్బరీ సాగు లాభదాయకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement