
రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న బీజేపీ
ఎల్కతుర్తి: పదేళ్లకుపైగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీస్తూ పాలన కొనసాగిస్తోందని రాజ్యాంగ పరిరక్షణ కమిటీ చైర్మన్ అనిమిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘జైబాపు, జైభీమ్, జై సంవిధాన్’ పాదయాత్ర శుక్రవారం ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో కొనసాగింది. ఈసందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ చేపట్టిన పాదయాత్ర గ్రామాల్లో విజయవంతంగా కొనసాగుతున్నదని చెప్పారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు బొమ్మనపల్లి అశోక్‌రెడ్డి, ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, గోలి రాజేశ్వర్‌రావు, సుకినె సంతాజీ, గొర్రె మహేందర్, మండ సుమన్‌గౌడ్ పాల్గొన్నారు.
రాజ్యాంగ పరిరక్షణ కమిటీ చైర్మన్ అనిమిరెడ్డి కృష్ణారెడ్డి