
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించాలి
కేయూ క్యాంపస్: ఆర్థిక అసమానతలు లేకుండా ధనవంతులు పేదవర్గాలకు ఆర్థిక సహకారం అందించి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు దోహదపడాలని సౌత్ ఆఫ్రికా దర్బన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీందర్ రేనా అన్నారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ ఆర్థిక శాస్త్ర విభాగంలో పాలకమండలి సభ్యులు, విభాగాధిపతి ప్రొఫెసర్ బి.సురేశ్‌లాల్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారతదేశంలో సోలార్ పవర్, విండ్ పవర్, ఎనర్జీలో అద్భుత ప్రగతి సాధిస్తున్నట్లు చెప్పారు. అనంతరం కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వికసిత భారత్ సాధనకు సమ్మిళిత వృద్ధి అత్యావశకమని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో కేడీసీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రాజారెడ్డి, అధ్యాపకులు రమేశ్, సత్యనారాయణ, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ రవీందర్, డాక్టర్ రమణ, మాలతీలత, ఎం.వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ఒకరోజు శిక్షణకు
దరఖాస్తుల ఆహ్వానం
కాజీపేట: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ ఆధ్వర్యంలో స్కిల్డ్ వర్కర్లకు ఒకరోజు శిక్షణ ఇచ్చి ప్రభుత్వ సర్టిఫికెట్ ఇవ్వడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ జి.రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, ప్లంబింగ్, బార్ బైండింగ్, పెయింటింగ్, టైల్స్ ఫ్లోరింగ్, కార్పెంటరీ, బిల్డింగ్, తదితర అంశాలపై ఒకరోజు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన యువత మరిన్ని వివరాల కోసం విక్టరీ ఐటీఐ కాజీపేట లేదా 79892 50779, 99496 84763 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
జాతీయ క్రీడల్లో
కమిషనరేట్ పోలీసులు
వరంగల్ క్రైం: కేరళలోని కొచ్చిలో శుక్రవారం నుంచి ప్రారంభమైన ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్, టెన్నిస్ పోటీల్లో వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారులు ఏసీపీ జితేందర్‌రెడ్డి, మధుసూదన్, ఎస్సై సురేశ్‌కుమార్, హెడ్ కానిస్టేబుల్ గీత, కానిస్టేబుళ్లు వేణు, తులసి తెలంగాణ రాష్ట్ర పోలీస్ జట్టు తరఫున పాల్గొన్నారు. ఈపోటీల్లో విజేతలుగా నిలిచి కమిషనరేట్‌కు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సీపీ సన్‌ప్రీత్‌సింగ్, అధికారులు ఆకాంక్షించారు.
అంబేడ్కర్ రచనల్ని
అధ్యయనం చేయాలి
కేయూ క్యాంపస్: అంబేడ్కర్ రచనలను అధ్యయనం చేయాలని కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం విద్యార్థులను కోరారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కేయూలోని కేంద్ర గ్రంథాలయంలో అంబేడ్క ర్ జీవిత చరిత్ర, భారత రాజ్యాంగంతో పాటు సుమారు 60 పుస్తకాలను ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. ఈనెల 14 వరకు ఈపుస్తక ప్రదర్శన కొనసాగనుంది. పుస్తక ప్రదర్శనను రిజిస్ట్రార్ రామచంద్రం లైబ్రరీ మెంబర్ ఇన్‌చార్జ్, లైబ్రరీ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ బి.రాధికారాణితో కలిసి ప్రారంభించారు. కేయూ లైబ్రరీ ఇన్‌చార్జ్ ఇసాక్‌ప్రభాకర్, తేజావత్‌జావీర్, లైబ్రరీ ఉద్యోగులు విద్యార్థులు పాల్గొన్నారు.
పోషణ పక్షోత్సవాలు
నిర్వహించాలి
కాజీపేట అర్బన్: ప్రతీ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షోత్సవాలు నిర్వహించాలని హనుమకొండ జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమాధికారి జయంతి అన్నారు. కాజీపేట మండలం కడిపికొండలోని రైతు వేదికలో శుక్రవారం పోషణ పక్షోత్సవాలపై ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా సీ్త్ర, శిశు సంక్షేమాధికారి జయంతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈనెల 22వ తేదీ వరకు పోషణ మాసంపై అవగాహన కల్పించాలని, సంపూర్ణ ఆరోగ్యానికి సమతుల ఆహారంపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ పీఓఎంహెచ్‌డబ్ల్యూ మంజుల, డాక్టర్ శ్రీదేవి, డీఈఎంఓ అశోక్‌రెడ్డి, హెచ్‌ఈఓ రాజేశ్వర్‌రెడ్డి, ఐసీపీఎస్, ఐసీడీఎస్, పోషణ్ అభియాన్ అధికారులు, హనుమకొండ, కాజీపేట, ఐనవోలు సెక్టార్ సూపర్‌వైజర్లు, సీడీపీఓ, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించాలి

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించాలి