
విధుల్లోకి ఔట్‌సోర్సింగ్ సిబ్బంది
నర్సంపేట రూరల్: నర్సంపేటలోని వైద్య కళాశాలలో టీవీవీపీ (తెలంగాణ వైద్య విధాన పరిషత్)కి సంబంధించిన 15 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని శుక్రవారం విధుల్లోకి తీసుకున్నట్లు ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ తెలిపారు. ‘రెన్యువల్ చేయక.. కొనసాగించక’ శీర్షికన సాక్షి దినపత్రికలో ఈనెల 6వ తేదీన కథనం ప్రచురితమైంది. దీంతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ స్పందించింది. జీఓ 42 ప్రకారం ఆ ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని కొనసాగించాలని ఆదేశించడంతో ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని విధుల్లోకి తీసుకున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
నర్సరీల్లో మొక్కలను
సంరక్షించాలి : డీపీఓ
నర్సంపేట రూరల్: గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలను సంరక్షించాలని డీపీఓ కల్పన అన్నారు. గురిజాల గ్రామంలోని నర్సరీని శుక్రవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. మొక్కల పెంపకంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వేసవికాలంలో ఉదయం సాయంత్రం వేళ మొక్కలకు నీళ్లు అందించాలని సూచించారు. అనంతరం గురిజాల గ్రామపంచాయతీని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. గ్రామాల్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని, ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలు రోడ్లపై ఉండకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఆమె వెంట ఎంపీఓ రామ్మోహన్, పంచాయతీ కార్యదర్శి తదితరులు ఉన్నారు.
కొమ్మాల ఆలయంలో
ప్రతీ శనివారం అన్నదానం
గీసుకొండ: మండలంలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో దాతల సహకారంతో ప్రతీ శనివారం అన్నప్రసాద (అన్నదానం) వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ట్లు ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అన్నదానం కోసం దాతలు సాయం అందించి సహకరించాలని ఆయన కోరారు.
పూలే ఆశయాలను కొనసాగించాలి
నర్సంపేట: మహాత్మా జ్యోతిబాపూలే ఆశయాలను కొనసాగించాలని మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ గుంటి రజనికిషన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రొఫెసర్, దళిత ప్రజాసంఘాల జేఏసీ కన్వీనర్ గద్ద వెంకటేశ్వర్లు, తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు జనగాం కుమార్, దళిత ప్రజాసంఘాల జేఏసీ కో కన్వీనర్లు కల్లెపల్లి ప్రణయ్‌దీప్, తడుగుల విజయ్ అన్నారు. పట్టణంలోని సెంట్రల్ బ్యాంకు ఎదుట దళిత ప్రజా సంఘాల జేఏసీ కోకన్వీనర్ గుంటి వీరప్రకాశ్ అధ్యక్షతన శుక్రవారం మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావుపూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యాకూబ్, వేముల రవి, రాజుయాదవ్, సదానందం, రాజు పాల్గొన్నారు. అలాగే, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సోల్తి సారయ్యగౌడ్ అధ్యక్షతన సర్దార్ సర్వాయి పాపన్న సెంటర్‌లో, బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద జ్యోతిబాపూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సి పల్ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్యగౌడ్, సోల్తి సాంబయ్య, సోల్తి మధు, పట్టణ అధ్యక్షుడు గండు రవి, డివిజన్ కార్యదర్శి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
నేడు విద్యుత్ సరఫరాలో
అంతరాయం
నర్సంపేట: సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల నేపథ్యంలో నేడు (శనివారం) విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ ఎన్.విజయభాస్కర్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపేస్తామని పేర్కొన్నారు.
నెక్కొండలో..
నెక్కొండ : మండలంలోని నెక్కొండ, రెడ్లవాడ, నాగారం విద్యుత్ సబ్‌స్టేషన్ల పరిధిలో శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు.

విధుల్లోకి ఔట్‌సోర్సింగ్ సిబ్బంది

విధుల్లోకి ఔట్‌సోర్సింగ్ సిబ్బంది