
రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండలం చింతలపల్లి సమీపంలో ఈనెల 27న నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతావు పిలుపునిచ్చారు. శనివారం ఆయన సభాస్థలి పనులు పరిశీలించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చాలన్నారు. ఈనెల 27న జరుగబోయే రజతోత్సవ సభకు అధిక సంఖ్యలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమాలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు పెద్ది శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, నాగుర్ల వెంకన్న, బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, నాయకులు పిట్టల మహేందర్, గోల్లె మహేందర్, ఎల్తూరి స్వామి, తంగెడ మహేందర్, కడారి రాజు, మహిపాల్‌రెడ్డి, వేముల సమయ్య, జడ్సన్, రాజ్‌కుమార్, చిట్టిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ రాజ్యసభ సభ్యుడు
కెప్టెన్ లక్ష్మీకాంతారావు
రజతోత్సవ సభ పనుల పరిశీలన