
హనుమాన్‌కు జడ్జిల పూజలు
గీసుకొండ: మండలంలోని కొనాయమాకుల శివారులో ప్రసిద్ధ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయాన్ని జిల్లా జడ్జిలు శనివారం సందర్శించి మొక్కులు చెల్లించారు. వరంగల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జి కె.చండీశ్వరీదేవితోపాటు ఆమె కుటుంబ సభ్యులు, ఫస్ట్ అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నడికొండ రితిక, వారి బంధువులు స్వామివారికి పూజలు చేశారు.
ప్రేమించాలని వేధిస్తున్న
యువకుడిపై కేసు
● సహకరించిన
మరో వ్యక్తిపై కూడా నమోదు
సంగెం: ప్రేమించాలని వేధిస్తున్న యువకుడితోపాటు అతడికి సహకరించిన మరొకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. లోహిత గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాలని అదే గ్రామానికి చెందిన నర్ర రాజ్‌కుమార్ వేధిస్తున్నాడు. ఈ విషయమై యువతి కుటుంబ సభ్యులు గ్రామస్తుల సమక్షంలో పిలిపించి మందలించగా ఇక జోలికి రానని చెప్పాడు. ఆ తర్వాత మళ్లీ వేధించసాగాడు. శనివారం రాజ్‌కుమార్, అతడి స్నేహితుడు దొమ్మాటి లోకేశ్ కిరాణా షాపులో ఉన్న యువతి వద్దకు వచ్చా రు. ప్రేమించాలని తలుపులను తన్నుతూ రాజ్‌కుమార్ బెదిరించాడు. అడ్డు వచ్చిన యువతి తల్లిదండ్రులను చంపుతామని హెచ్చరించాడు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు రాజ్‌కుమార్, లోకేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రైతుల కష్టం బుగ్గిపాలు
గీసుకొండ: చేతికొచ్చిన మొక్కజొన్న పంట దగ్ధం కావడంతో రైతులు కంటనీరు పెడుతున్నారు. గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారంలో శనివారం గోదాసి రమేశ్–మాధవి దంపతుల రెండు ఎకరాల మొక్కజొన్న చేనుతోపాటు అందులోని డ్రిప్ పైపులు పూర్తిగా కాలిపోయాయి. తమకు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లిందని, గుర్తుతెలియని వ్యక్తులు కాలబెట్టి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేశారు. అలాగే, గ్రామానికి చెందిన వల్లెం సతీశ్ సాగు చేసిన 20 గుంటల మొక్కజొన్న చేను, వల్లెం శ్రీనుకు చెందిన 20 గుంటల మొక్కజొన్న చేను కాలి బూడిదైంది. తమకు రూ.లక్ష మేర నష్టం వాటిల్లిందని ఆ ఇద్దరు రైతులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని ముగ్గురు రైతులు కోరారు.
వైభవంగా పాంచాల
రాయస్వామి జాతర
గీసుకొండ: శాయంపేట హవేలిలోని పాంచాల రాయస్వామి (శ్రీ కృష్ణ) జాతర శనివారం రాత్రి వైభవంగా జరిగింది. గీసుకొండ, సంగెం మండలాలతోపాటు వరంగల్ నగరం నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మాజీ ఎంపీపీ ముంత కళావతి, ఆమె భర్త రాజయ్య, కాంగ్రెస్ నాయకుడు వీరాటి రవీందర్‌రెడ్డి, పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
చెరువు శిఖంలో
అక్రమ నిర్మాణాలు
దుగ్గొండి: లక్ష్మీపురం గ్రామంలోని పెద్దమ్మకుంట చెరువు శిఖం భూమి ఆక్రమణకు గురవుతోంది. శిఖం మొత్తం లక్ష్మీపురం నీరుకుళ్ల ప్రధాన రహదారిని ఆనుకుని ఉండడంతో అనే క మంది భూమిని ఆక్రమిస్తున్నారు. వారం రోజులుగా కొంతమంది రోడ్డువైపు పెద్ద పరదాలు కట్టి గుట్టుగా నిర్మాణాలు చేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వివరణ కోసం తహసీల్దార్ రవిచంద్రారెడ్డిని ఫోన్‌లో సంప్రదించగా స్పందించ లేదు.

హనుమాన్‌కు జడ్జిల పూజలు

హనుమాన్‌కు జడ్జిల పూజలు

హనుమాన్‌కు జడ్జిల పూజలు