
ఇబ్బందులు రాకుండా చూస్తాం..
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం. జిల్లా వ్యాప్తంగా 182 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే రాయపర్తి మండలం కొలనుపల్లి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, కలెక్టర్ సత్యశారద ప్రారంభించారు. అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నాం.
– సంధ్యారాణి,
మేనేజర్ జిల్లా పౌరసరఫరాల శాఖ