
పల్లె దవాఖానలను సద్వినియోగం చేసుకోవాలి
నెక్కొండ: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్న పల్లె దవాఖానలను సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పిలుపునిచ్చారు. అలంకానిపేట పీహెచ్‌సీ పరిధిలోని తోపనపల్లి గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానను ఆదివారం ఎమ్మెల్యే దొంతి ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు దవాఖానలను అందుబాటులో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రోగులకు అవసరమయ్యే అన్ని రకాల వైద్య సేవలతోపాటు మందులు అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మర్ రావుల హరీశ్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బక్కి అశోక్, సర్సంపేట కోర్టు ఏజీపీ బండి శివకుమార్, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రకాశ్, అలంకానిపేట వైద్యాదికారులు అర్చన, అఖిల్, డెమో అనిల్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి