
పిల్లలే బాధితులు!
సెలవుల సమయం, ఒంటిపూట బడులు ఉండడంతో పిల్లలనే టార్గెట్ చేస్తూ కొంతమంది బిజినెస్ చేస్తున్నారు. కల్తీ, నాసిరకం ఐస్‌క్రీమ్‌లు అమ్ముతున్నారు. వీధుల్లో తిరిగే బండ్ల వద్ద, షాపుల్లో ఎక్కువ మంది పిల్లలే కొనుగోలు చేస్తున్నారు. చల్లని ఐస్‌క్రీం పేరిట నాసిరకం, కల్తీ ఐస్‌క్రీంలు పిల్లలను ఆకర్షిస్తున్నాయి. కృత్రిమ రంగులతో, కల్తీ నీరు, రసాయనాలతో తయారు చేసిన ఐస్‌క్రీంలు తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని, పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.