
కారు ఢీకొని మోటార్ సైక్లిస్ట్ దుర్మరణం
పెంటపాడు: పెంటపాడులోని డీఆర్ గోయంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మోటార్‌సైక్లిస్టు దుర్మరణం పాలయ్యాడు. కాగా ఈ ప్రమాదంలో మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. పెంటపాడు ఎస్సై ఎన్.శంకర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముదునూరుపాడుకు చెందిన పులగం కిషోర్‌రెడ్డి (21), అతని స్నేహితుడు సత్తి మణికంఠరెడ్డి పెంటపాడు నుంచి ముదునూరుపాడుకు బైక్‌పై వెళుతున్నారు. పెంటపాడులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్దకు వచ్చేసరికి తాడేపల్లిగూడెం నుంచి భీమవరం వైపు వేగంగా వెళుతున్న కారు వీరి మోటార్‌సైకిల్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ నడుపుతున్న కిషోర్‌రెడ్డి, మణికంఠరెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వీరిని గూడెంలోని ఓ ప్రైవేటు ఆసుసత్రికి తరలిస్తుండగా అక్కడ చికిత్సపొందుతూ కిషోర్‌రెడ్డి మృతి చెందాడు. మరో యువకుడు మణికంఠ రెడ్డిని మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు. కిషోర్‌రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎస్సై ఎన్.శంకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో యువకుడికి తీవ్ర గాయాలు