వర్షా కాలం.. విద్యుత్‌తో భద్రం
యలమంచిలి: ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్న ప్రస్తుత తరుణంలో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇళ్లు, రోడ్లు, కార్యాలయాలు, వ్యవసాయ బావుల వద్ద ముప్పు ఎక్కువ ఉంటుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణ, ఆస్తి నష్టాలు తప్పవు. ముఖ్యంగా పొలాల్లో వ్యవసాయ పనులు చేసే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలి. వర్షంలో వైర్లు తెగిపడినట్టు గుర్తిస్తే వాటి దగ్గరకు వెళ్లకుండా విద్యుత్ శాఖ అధికారులు లేదా సిబ్బందికి సమాచారం ఇవ్వాలి.
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రతలు
● తడిచేతులతో తీగలు, స్విచ్లు తాకొద్దు.
● సొంతంగా విద్యుత్ మరమ్మతులు చేయడం ప్రమాదకరం.
● నాణ్యమైన విద్యుత్ పరికరాలను వాడాలి.
● విద్యుత్ సిబ్బంది సెల్ నంబర్లు దగ్గర ఉంచుకోవాలి.
● వీధులు, పొలాల్లో తడిచిన స్తంభాలను తాకొద్దు.
● తోటలు, పొలాలు ఇతర ఏ ప్రదేశంలో అయినా విద్యుత్ తీగలు తెగిపడి ఉంటే వెంటనే 1912కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలి.
● విద్యుత్ తీగలు చెట్టు తాకి ఉన్న చెట్లను ముట్టుకోవద్దు. ఆ చెట్టుకు విద్యుత్ సరఫరా అయ్యే అవకాశం ఉంది.
● వర్షం పడుతున్నప్పుడు తడిగా ఉన్న చేతులతో స్చిచ్లు వేయొద్దు.
● విద్యుత్ తీగలపై బట్టలు ఆరబెట్టొద్దు.
● వర్షం పడుతున్నపుడు ఇంట్లో విద్యుత్ పోయిందని సొంత ప్రయోగాలు చేయవద్దు. విద్యుత్ పనులు అనుభవం ఉన్న వ్యక్తితో చేయించుకోవాలి.
● విద్యుదాఘాతం సంభవిస్తే వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయాలి. తర్వాత విద్యుత్ వైర్లు, షాక్‌లో ఉన్న వ్యక్తిని ప్లాస్టిక్ కరత్రో లేదా ఎండు కరత్రో వేరు చేయాలి. అనంతరం విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలి.
జాగ్రత్తలతో ప్రమాదాల నివారణ
వర్షాకాలంలో విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. వర్షా కాలంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రతలు పాటిస్తూ ప్రమాదాలకు గురికాకుండా ఉండాలి. వీధిలో గాలీవర్షానికి తీగలు తెగిపడితే వెంటేనే మాకు సమాచారం అందించాలి. మరమ్మతులు చేస్తాం. విద్యుత్ సమస్య తలెత్తితే వెంటనే సమాచారం అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.
– దున్న రాజీవ్, ఎలక్ట్రికల్ ఏఈ, యలమంచిలి
Comments
Please login to add a commentAdd a comment