
నేటి నుంచి పారిశుద్ధ్య సేవలు బంద్
తణుకు అర్బన్: తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రి కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం నుంచి విధుల బహిష్కరణకు దిగుతున్నట్టు ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ సంఘ తణుకు శాఖ అధ్యక్షుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు చెప్పారు. సోమవారం తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రి ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు చెల్లించలేదని, 29 నెలలుగా పీఎఫ్ సొమ్ము కార్మికుల ఖాతాల్లో జమ చేయలేదన్నారు. ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా విస్తరించినా గతంలో ఉన్న 19 మంది కార్మికులతోనే పనులు చేయించడం శోచనీయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment